టీ-నోట్ పై దిగ్విజయ్ తిరకాసు సమాధానాలు

Publish Date:Oct 3, 2013

Advertisement

 

ఈ రోజు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ తెలంగాణా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది గనుక దానిపై ఈ రోజు సాయత్రంత్రం జరగనున్న క్యాబినెట్ సమావేశంలో చర్చించవచ్చని మీడియాకు తెలిపారు. ఈ రోజు క్యాబినెట్ లో టీ-నోట్ ప్రవేశపెడతారా అనే ప్రశ్నకు జవాబు చెపుతూ ఆవిషయం నాకు కూడా తెలియదు. ప్రవేశపెడుతున్నట్లు మీడియాలో వార్తలు చూసాను,” అని జవాబిచ్చారు. అయితే రాష్ట్రవిభజన నిర్నయమనేది అందరి ఆమోదంతో తీసుకోన్నదే గనుక దానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే అని ఆయన గట్టిగా చెప్పారు. అంటే ఇది ముఖ్యమంత్రికి ఆయన మీడియా ద్వారా ఇస్తున్న సందేశమని భావించవచ్చును.

 

కానీ, హోంమంత్రి షిండే మీడియా ప్రశ్నకు జవాబు చెపుతూ ఆ వార్తలన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు. అయితే టీ-నోట్ ఎప్పుడో పూర్తిగా తయారయ్యి షిండే వద్ద సిద్ధంగా ఉందని మరో తాజా వార్త.

 

ఈ టీ-నోట్ వార్తలతో సీమాంధ్ర నేతలలో, మంత్రులలో, ఉద్యోగులు, ప్రజలలో ఒక్కసారిగా మళ్ళీఅలజడి మొదలయింది. ఉద్యోగులు కేంద్రమంత్రుల ఇళ్ళను ముట్టడించి ధర్నాలు చేస్తున్నారు. మీడియాలో వస్తున్న వార్తలనినిజమో కాదో ఖచ్చితంగా దృవీకరించవలసిన కాంగ్రెస్ నేతలిద్దరూ చెరో రకంగా మాట్లాడటం భాద్యతా రాహిత్యమేనని చెప్పక తప్పదు. రాష్ట్రవిభాజనపై వెనకడుగు వేసేది లేదని గట్టిగా చెపుతున్న దిగ్విజయ్ సింగ్, మరి టీ-నోట్ పై అంతే ఖచ్చితంగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారో తెలియదు

 

కానీ గమనించాల్సిన విషయం ఏమిటంటే కాంగ్రెస్ అధిష్టానం తనతో నేరుగా సంప్రదింపులు జరుపుతోందని ప్రకటించిన తెరాస అధ్యక్షుడు కేసీఆర్ రెండు రోజుల క్రితమే టీ-నోట్ క్యాబినెట్ ప్రవేశపెట్టడానికి మరికొంత సమయం పట్టవచ్చని తెలిపారు. అందువల్ల ఈరోజు టీ-నోట్ క్యాబినెట్ ముందుకు రాకపోవచ్చును.

 

.

.

By
en-us Political News