కరోనా మృతదేహాల అంత్య‌క్రియ‌ల‌కు తెలంగాణ మార్గదర్శకాలు!

కరోనాతో చనిపోయిన శవాల్లో వైరస్ ఉంటుంది. అయితే ఈ వైర‌స్‌ బయటకు వ్యాపించకుండా పకడ్బందీగా ప్యాకింగ్ చేసి డిస్ మాటిల్ చేయాలి.   మ‌తాచారాల‌ను బ‌ట్టి  హిందూ, ముస్లిం, క్రైస్తవుల ప‌ద్ధ‌తి వేరు వేరుగా వుంటుంది.  హిందువులు మెజార్టీ శవాలను అగ్నికి ఆహుతి చేస్తారు. ముస్లింలు  భూమిలో పాతిపెడతారు. క్రైస్తవులు భూమిలోనే పెట్టేలో పెట్టి ఖననం చేస్తారు. 

హిందూ, ముస్లిం, క్రైస్తవ ఈ మూడు సంప్రదాయాలకు విలువనిస్తూ కరోనాతో చనిపోయిన వారి అంత్య‌క్రియ‌ల‌పై తెలంగాణా ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. అన్ని మతాల విషయంలో కరోనా మృతదేహాల నిర్వహణ తప్పనిసరిగా ఒకే విధంగా ఉంటుందని అధికారులు స్ప‌ష్టం చేశారు.  

ప్రస్తుతం తెలంగాణలో కరోనాతో 11 మంది మరణించారు. అందులో ఒకరు ముస్లింమేతరుడు.

1. కరోనాతో మరణిస్తే ఆసుపత్రి వాహనాల్లో నియమించిన వ్యక్తులతో మృతదేహాలను ప్యాకింగ్ చేస్తారు. శ్మశానవాటికకు తరలిస్తారు. 

2. కేవలం ఐదుగురు కుటుంబ సభ్యులకు మాత్రమే ఖననం వేళ అనుమతి ఉంటుంది.

3.మృతదేహాల ఖననాన్ని వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వమే పకడ్బందీగా నిర్వహిస్తుంది.

4.హిందూ కరోనా మృతదేహాలను దహనం చేస్తారు.

5. ముస్లిం క్రైస్తవ మృతదేహాలను వారి మత ఆచారం ప్రకారం ఖననం చేస్తారు.