కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆత్మహత్య

 

మహారాష్ట్రలోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆత్మ హత్యకు పాల్పడిన ఘటన వెలుగుచూసింది. వివరాల ప్రకారం మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంయజ్ మురళీధర్ ససానే ఆత్మహత్యకు పాల్పడ్డారు. మురళీధర్ ససానే ఆత్మహత్య చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈరోజు ఉదయం తన నివాసంలో మురళీధర్ తనను తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. అయితే ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఇంకా తెలియలేదని.. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని లోనిలోని ప్రవరా మెడికల్ సైన్నెస్ ఇన్ స్టిట్యూట్ క్ పంపినట్టు చెప్పారు.