జమ్ముకశ్మీర్‌.. 24 గంటలు ఎన్‌కౌంటర్

జమ్ముకశ్మీర్‌లోని ‌కరణ్‌నగర్‌ సీఆర్‌పీఎఫ్ శిబిరంపై నిన్న జరిగిన ఉగ్రవాదుల దాడికి యత్నించిన ముష్కరుల కోసం సైన్యం తీవ్రంగా గాలిస్తోంది. సీఆర్‌పీఎఫ్ క్యాంప్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు ఉగ్రవాదులను ఓ జవాను గుర్తించాడు. దీనిని గమనించిన ముష్కరులు అక్కడి నుంచి తప్పించుకుని ఓ భవనంలో దాక్కున్నారు. వారిని బయటకు రప్పించేందుకు సైన్యం ప్రయత్నిస్తున్నటికీ.. వారు ఎంతకు బయటకు రావడం లేదు.. నిన్న ఉదయం పది గంటలకు ప్రారంభమైన ఎన్‌కౌంటర్ 24 గంటలు గడిచినా కూడా కొనసాగుతూనే ఉంది.