కేసీఆర్ "కిట్" ఎత్తుకెళ్లిన మంత్రిగారు...

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కిట్ ను బిహార్ మంత్రి తీసుకెళ్లారు. కేసీఆర్ కిట్ ఏంటి..? మంత్రి తీసుకెళ్లడమేంటీ..? అనుకుంటున్నారా..? అది తెలుసుకోవాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే. కేసీఆర్ ఇటీవలే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రొత్సహించడానికి, పేద కుటుంబాల గర్భిణు లకు ఆసరాగా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘కేసీఆర్‌ కిట్‌’ అనే పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా.. మాతా శిశు సంరక్షణ కింద రూ.15వేల రూపాయలతో కిట్ ఇస్తున్నారు. గర్భిణీలకు రూ.12 వేలు ఆర్థిక సహాయంతో పాటు…ఆడపిల్ల పుడితే రూ.1000ను ప్రొత్సాహకంగా ఇస్తున్నారు.  దీంతో కేసీఆర్ కిట్స్ దేశవ్యాప్తంగా ప్రచారానికి నోచుకున్నాయి. దీనిల భాగంగానే అయితే ఈ పథకం నచ్చిన బిహార్ ఆరోగ్య మంత్రి మంగళ్ పాండే.. తమ రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేయాలని..అందుకోసం ఒక కిట్ ను తమ వెంట తీసుకెళుతున్నామని చెప్పారు. అంతేకాదు మా బీహార్‌లోనూ ర‌క‌రకాల ప‌థ‌కాలు అమ‌లు అవుతున్నాయి. ఇక్కడ వినూత్న ప‌థ‌కాలు అమ‌లవుతున్న విష‌యం మా దృష్టికి వ‌చ్చింది. ఒక‌సారి వాటిని ప‌రిశీలిద్దామ‌ని హైద‌రాబాద్‌ వ‌చ్చినట్లు చెప్పారు. ఆ ప‌థ‌కం ఏ విధంగా రూపొందించారు? మ‌హిళ‌లు, పిల్ల‌లు ఏ విధంగా ఆ ప‌థ‌కం ద్వారా ల‌బ్ధి పొందుతున్నార‌నే అంశాల‌ను తెలుసుకున్నామన్నారు. పనిలో పనిగా ఒక కేసిఆర్ కిట్‌ని వెంట తీసుకెళ్లారు.