విజయవాడలో చంద్రబాబుకి కేసీఆర్ ఆహ్వానం.. కారణం అదేనా..?
posted on Dec 15, 2015 10:38AM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆయన నివాసంలో కలిసి తాను నిర్వహిస్తున్న ఆయుత చండీయాగానికి పిలిచిన సంగతి తెలిసిందే.అలాగే తన నివాసానికి వచ్చిన కేసీఆర్ ను సైతం చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా కేసీఆర్ తన యాగానికి కుటుంబ సమేతంగా రావాలని ఆహ్వానించగా దానికి చంద్రబాబు సైతం తప్పకుండా వస్తానని చెప్పారు.ఆతరువాత చంద్రబాబు, కేసీఆర్ కలిసి ఓ పదిహేను నిమిషాలు మాట్లాడుకోవడం..అనంతరం చంద్రబాబు కేసీఆర్ కోసం ప్రత్యేకం ఏర్పాటు చేయించిన విందులో పాల్గొనడం ఆతరువాత కేసీఆర్ మళ్లీ హైదరాబాద్ కు రావడం జరిగాయి.
అయితే ఇక్కడి వరకూ బానే ఉన్నా కేసీఆర్ ఇంత సడెన్ గా..అది కూడా ప్రత్యేక హెలీ కాఫ్టర్ లో వచ్చి ఆహ్వానించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కేసీఆర్ ఇంత సడెన్ రావడం వెనుక వేరే మర్మ ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.ఎందుకంటే ఇంకా రెండు రోజుల్లో ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి.ఈ సమావేశాలకి చంద్రబాబు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది.ఈ నేపథ్యంలో కేసీఆర్ అప్పుడైనా చంద్రబాబుని ఆహ్వానించవచ్చు..అయితే ప్రత్యేకంగా విజయవాడకి వచ్చి ఆహ్వానించడంతో మీ ప్రాంతం ఇది..ఇదే మీ రాజధాని అని..హైదరాబాద్ కాదని చెప్పకనే చెప్పడానికి ఇలా చేశారని అంటున్నాయి రాజకీయ వర్గాలు.అంతేకాదు త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికలకు కూడా కలిసి వస్తుందని ఇలా ప్లాన్ చేశారంట. ఎందుకంటే హెదరాబాద్ సీమాంధ్ర సెటిలర్లు ఎక్కువ కాబట్టి..వారి దగ్గర కూడా మార్కులు కొట్టేయడానికే ఇలా చేశారంట.మరి అసలు రహస్యమేంటో కేసీఆర్ కే తెలియాలి..