'మా స్కూల్.. మంచి స్కూల్'... జగన్ కొత్త ప్రోగ్రామ్

 

విజయవాడలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు సీఎం జగన్. ఈ రోజు మన పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదవకపోతే నష్టపోయేది మనం.. మన రాష్ట్రం..మన జాతి.. పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి చదువు అంటూ గొప్పగా సభను మొదలుపెట్టారు. ఆ చదువు ప్రతి పేదవాడికీ చెందాలి.. ఆ చదువు కోసం ఏ పేదింట్లో  ఏ తల్లి కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా తమ పిల్లల్ని చిరునవ్వుతో స్కూళ్ళకు పంపించాలి. అప్పుడే పేద కుటుంబాలు బాగుపడతాయంటూ హితవు పలికారు. ఆ దిశగా అడుగులు వేస్తూ డిసెంబర్ లోనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు.

రాష్ట్రంలో 45,000 ల స్కూళ్లు ఉండగా.. అందులోని 15,000 స్కూళ్లతో నాడూ నేడూ అనే ప్రోగ్రామ్ శ్రీకారం చుడుతున్నామని అన్నారు. ఆ 15,000 స్కూళ్ల ఫోటోలు కూడా చూపిస్తాము. నేడు ఎలా ఉందో.. మార్పు చెందాక నాడు ఎలా ఉందో అని పెట్టి స్కూళ్ల ఫోటోలను విడుదల చేస్తామన్నారు. ప్రతి స్కూళ్లో ఉండవలసినవి అన్ని సమకూరేట్టుగా చేస్తామన్నారు. ప్రతి స్కూల్లోనూ బాత్రూములు,నీళ్ళు,బ్లాక్ బోర్డ్ లు, ఫర్నీచర్,ఫ్యాన్ లు,ట్యూబ్ లైట్లు ఉండాలి. ప్రతి స్కూలుకూ ఒక కంపౌండ్ వాల్ ఉండాలి. ప్రతి స్కూల్ కు పెయింటింగ్, ఫినిషింగ్స్ జరిగి ఉండాలి. పిల్లలు స్కూళ్లకు వెళ్ళేటప్పుడు "మా స్కూల్ మంచి స్కూల్" అని చెప్పే పరిస్థితి రావాలి. ఇది కాకుండా ప్రతి స్కూళ్లోను ఇంగ్లీష్ ల్యాబ్స్ కూడా పెట్టబోతున్నామని కూడా గర్వంగా తెలియజేశారు. వచ్చే సంవత్సరం నుండి ప్రతి గవర్నమెంట్ స్కూళ్ళో కూడా ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ చేస్తున్నామని.. ఆ ఇంగ్లీష్ తో పాటు తెలుగు ని గానీ ఉర్ధూ గానీ ఏదైనా భాషను కూడా కంపల్సరీ సబ్జెక్ట్ గా చేస్తామని చెప్పారు.