విపక్షాలకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్...

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విపక్ష నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకు విపక్షనేతలు ఎన్నో కుట్రలకు పాల్పడుతున్నారని.. తనపై కోపం ఉంటే తీర్చుకోవాలని, రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మాత్రం కుట్రదారులను ఉక్కుపాదంతో అణచివేస్తానని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఐదు కోట్ల ఆంధ్రులు గర్వపడేలా రాజధానిని నిర్మించడం భగవంతుడు తనకు ఇచ్చిన బాధ్యత అని... దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తానని చంద్రబాబు చెప్పారు. రాజధాని పనులను వేగవంతం చేస్తానని తెలిపారు. ఎవరెన్ని ఆటంకాలు కల్పించినా అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులను ప్రపంచబ్యాంక్ నుంచి సాధించితీరుతానని చెప్పారు.