మద్యం తాగి డీజీపీ కూతురి వీరంగం...


 

పండిత పుత్ర.. పరమ సుంట అన్న సామెత వినే ఉంటాం కదా... కొంతమందిని చూస్తే అలానే అనిపిస్తుంటుంది. తమ తల్లిదండ్రుల అధికారాన్ని చూసి వారి పిల్లలు చేసే హంగామాలు చూస్తే ఇలాంటి సామెతలు గుర్తొస్తుంటాయి... మానాన్న పలానా... మానాన్న ఎవరో తెలుసా... మానాన్న అధికారంలో ఉన్నారు.. అంటూ అహంకారంతో ప్రవర్తిస్తుంటారు. పాపం వాళ్ల పరువులు తీస్తుంటారు. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటారా... తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడులో చోటుచేసుకుంది.

 

చెన్నైలోని పాలవక్కం బీచ్ ప్రాంతంలో తమిళనాడు అదనపు డీజీపీ కూతురు మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడింది. పట్టుబడింది కాక తన వాహనాన్ని ఆపిన కానిస్టేబుల్‌‌పై ఆగ్రహం వ్యక్తంచేసింది. మా ఫాదర్ టాప్ మోస్ట్ పోలీసు అధికారి.. నా కారు ఆపుతావా? నీ ఉద్యోగం ఊడగొడతా అంటూ కానిస్టేబుల్‌కి వార్నింగ్ ఇచ్చింది. అంతేనా అక్కడితో ఆగకుండా... వెంటనే తన తండ్రికి ఫోన్ చేసి కానిస్టేబుల్‌ని విధుల నుంచి తప్పించాలని సూచించింది. ఇక ఈ తతంగాన్ని కానిస్టేబుల్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయ్యింది. ఇంకా కమిషనరేట్‌కి వెళ్లి కానిస్టేబుల్ అతిగా ప్రవర్తించాడని, వద్దని చెబుతున్నా వీడియో తీసి తమకు ఇబ్బంది కల్పించాడని, అతడిపై చర్య తీసుకోవాలని ఫిర్యాదు చేసింది.