భారీ ఎన్ కౌంటర్.. 10 మంది మావోయిస్టులు హతం..

 


ఛత్తీస్ గఢ్ లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఛత్తీస్ గఢ్ నారాయణపూర్ జిల్లా కేలంబస్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించగా వారికి మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. మావోయిస్టులు కూడా ఎదురుకాల్పులు జరిపారు. గంటల తరబడి జరిగిన ఈ కాల్పుల్లో పది మంది మావోయిస్టులు హతమయ్యారు. ముగ్గురు మావోయిస్టులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని రాయపూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.