పిపిఏలపై జగన్ సర్కార్ తప్పుడు ప్రచారం: కేంద్ర మంత్రి ఆగ్రహం

 

 

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వం విద్యుత్ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల్లో భారీ అవినీతి చోటు చేసుకుందని ఆరోపించిన వైసిపి అధికారం లోకి రాగానే వాటి పై  సమీక్షలు జరుపుతున్న విషయం తెలిసిందే. దీని పైన కొని సంస్థలు హైకోర్టుకు కూడా వెళ్లడం జరిగింది. తాజాగా ఇదే విషయమై కేంద్ర ఇంధన శాఖా మంత్రి ఆర్కే సింగ్ జగన్ ప్రుభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవర్ ప్రాజెక్టులపై జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా అయన తీవ్ర విమర్శలు చేశారు. విద్యుత్ ఒప్పందాల్లో అవకతవకలు జరిగినట్టు ఎక్కడా ఆధారాలు లేకపోయినా పీపీఏలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోందని అయన చెప్పారు. కేంద్రం ఎన్నిసార్లు చెప్పినా జగన్ వినిపించుకోవడం లేదని కేంద్ర మంత్రి అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో పీపీఏలలో అవకతవకలు జరిగాయంటూ ఒక లేఖ పట్టుకుని జగన్ గతంలో ఢిల్లీకి వచ్చారని ఆర్కే సింగ్ తెలిపారు. అవకతవకలపై ఎలాంటి ఆధారాలు లేకుండా పీపీఏను రద్దు చేయమంటే ఎలా సాధ్యమంటూ ప్రశ్నించారు. సీఎం జగన్ వైఖరి దేశ వ్యాప్తంగా పెట్టుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని మండిపడ్డారు.