మోడీ సర్కార్ కాదు... లీకుల సర్కార్

 

ఇప్పటికే నోట్ల రద్దు, జీఎస్టీ, దళితులపై దాడులు ఇలా చాలా కారణాలవల్ల దేశవ్యాప్తంగా బీజేపీపై వ్యతిరేకంగా పెరిగిపోయింది. మరోపక్క.. బ్యాంకుల కుంభకోణాలు.. వేలకు వేలు కోట్లు కుంభకోణం జరగడం.. దేశాన్ని విడిచిపెట్టి పోవడం.. వాళ్లు దేశాన్ని విడిచి పారిపోయేంత వరకూ చూసి ఆ తరువాత నోరెళ్లబెడతారు. ఇక కుంభకోణాలు వెలుగుచూశాక 'కఠిన చర్యలు తీసుకుంటాం' అని ప్రభుత్వాలు చెప్పే మాటలను నమ్మడం కూడా ఎప్పుడో మానేశారనుకోండి. వాళ్లెంత సీరియస్ గా చెప్పినా..అంతా ఉత్తిదే అని ఫిక్స్ అయిపోయారు.

 

ఇప్పుడు వాటికితోడు పేపర్ల లీకులు ఒకటి. నిన్న ఎస్ఎస్‌సి.. నేడు సీబీఎస్ఈ. దీంత ఇప్పుడు విద్యార్ధుల తల్లిదండ్రులు బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలన్ని స్కాముల్లా మారిపోతున్నాయని జేపీ ప్రభుత్వంపై విమర్సలు గుప్పిస్తున్నారు. మరి ఏ చిన్నఛాన్స్ దొరుకుతుందా విమర్శిద్దామా అని చూసే ప్రతిపక్షాలకు మంచి పాయింట్ దొరికింది. దీంతో దొరికిందే ఛాన్స్ గా బీజేపీ వైఫల్యాన్ని ఎండగడుతున్నారు. దేశవ్యాప్తంగా 28లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన సీబీఎస్ఈ పరీక్షను పకడ్బందీగా నిర్వహించకపోవడం మోడీ ప్రభుత్వ వైఫల్యం చెందిందని...అసలు మోడీ సర్కార్ అని పేరు తీసేసి పేపర్ లీక్ సర్కార్ అని మార్చుకోండి అని మండిపడ్డారు. ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విటర్ వేధికగా చేసుకుని మోదీపై ఘాటైన విమర్శలు చేశారు. ‘మోదీ సర్కార్‌లో లీకులే లీకులు. డేటా లీక్. ఆధార్ లీక్. ఎస్‌ఎస్‌సీ ఎగ్జామ్ లీక్. ఎలక్షన్ డేట్ లీక్.. ఇప్పుడు సీబీఎసీఈ పేపర్ల లీక్, యాతావాతా చౌకీదార్ వీక్’ అంటూ కాంగ్రెస్ చీఫ్ సెటైర్లు వేశారు. మున్ముందు ఇంకెన్ని లీక్‌లు చూస్తామో అంటూ ఆయన ఎద్దేవా చేశారు. అంతేకాదు.. పరీక్షల సమయంలో ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలనే దానిపై ప్రధాని మోడీ 'వారియర్స్' అనే పుస్తకాన్ని రాశారు... ఇప్పుడు పేపర్ లీకేజీతో విద్యార్థుల భవిష్యత్తు నాశనమవడంతో.. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఈ ఒత్తిడిని ఎలా అధిగమించాలో చెబుతూ.. మోడీ 'వారియర్స్-2' పుస్తకాన్ని రాస్తే బాగుంటుందని సెటైర్లు వేశారు. మొత్తానికి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు... ఇప్పటికే ప్రజల్లో ఎంతో వ్యతిరేకత మూటగట్టుకున్న బీజేపీ.. ఇప్పుడు ఈ స్కాముల వల్ల.. లీకులు వల్ల పార్టీ పరిస్థితి చాలా దారణంగా తయారైనట్టు ఉంది. మరి ఇప్పటికైనా బీజేపీ కఠిన చర్యలు తీసుకుంటుందో..లేదో..? చూడాలి.