వైసీపీ నేత బైరెడ్డికి చేదు అనుభవం.. కోడి గుడ్లతో దాడి..
posted on Jun 14, 2016 10:22AM
వైసీపీ నేత, రాయలసీమ పరిరక్షణ సమితి అధినేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. పులి వెందుల పర్యటనకు వెళ్లిన ఆయనపై ప్రజలు కోడి గుడ్లతో దాడి చేశారు. లింగాల మండలం పార్నపల్లెలో పర్యటనకు వెళ్లిన ఆయన టీడీపీపై విమర్శలు చేశారు. ‘రాయలసీమ ప్రజల గొంతు కోసి ఆంధ్రాలో అమరావతి పేరుతో రాజధాని నిర్మిస్తున్నారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల్లో టీడీపీ హామీలు గుప్పించింది. ఇప్పటివరకు రుణాల మాఫీ, జాబులు, నిరుద్యోగ భృతి ఇచ్చిన దాఖలా ఎక్కడా కనిపించలేదు’’ అని వ్యాఖ్యానించారు. అంతే ఆయన వ్యాఖ్యలకు ఆగ్రహం చెందిన గ్రామ యువకులు ‘రుణాలు ఎక్కడ మాఫీ కాలేదో చెప్పండి’’ అంటూ బైరెడ్డిని నిలదీశారు. అంతేకాదు అబద్ద ప్రచారం చేస్తున్నారంటూ ఆయనపై కోడి గుడ్లతో దాడి చేశారు. దీంతో షాక్ కు గురైన బెరెడ్డి ప్రసంగం మధ్యలోనే ఆపి అక్కడి నుండి వెళ్లిపోవాల్సి వచ్చింది.