మనోజ్ తివారీ ఇంటిపై దాడి.. పోలీసుల కుట్రే..!
posted on May 1, 2017 11:01AM

దిల్లీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ తివారీ ఇంటిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. మనోజ్ తివారీ ఇంట్లో లేని సమయంలో దాడికి పాల్పడిన్టట్టు తెలుస్తోంది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని నలుగురుని అరెస్ట్ చేశారు. ఇక ఈ దాడిపై స్పందించిన మనోజ్ తివారీ.. దాడి వెనుక పోలీసుల కుట్ర ఉందని మనోజ్ తివారీ ఆరోపిస్తున్నారు. దిల్లీలో అత్యంత భద్రత కలిగిన ప్రదేశంలో ఉండే తన ఇంటిలోకి దుండగులు ప్రవేశించారని.. అసలు ‘దిల్లీలో ఏం జరుగుతోంది.. పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఓ లోక్‌సభ సభ్యుని ఇంటిలోకి దుండుగులు ప్రవేశించి.. అరగంటపాటు బీభత్సం సృష్టించారు. నా సిబ్బందిపై దాడికి దిగారు.’ అని మండిపడ్డారు.