భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు

 

ఖమ్మం జిల్లా భద్రాచలం పుణ్యక్షేత్రంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు సీతారాములకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పోచారం శ్రీనివాసరెడ్డి, జగదీష్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ విద్యాసాగర్, పలువురు ప్రజా ప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు.