నెలన్నర రోజుల్లో ప్రత్యేక హోదా తథ్యం! సుజనా

 

ఏపీ ప్రత్యేక హోదాపై ఎన్నో రకాల చర్చలు జరుగుతున్నాయి. ఒక పక్క కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందని.. ఇవ్వదని అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి సుజనా చౌదరి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రావడం ఖాయమని.. మరో నెలన్నర రోజుల్లో ప్రత్యేక హోదా తథ్యమని జోస్యం చెప్పారు. చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ సమావేశంలో పాల్గొన్న ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంపై కేంద్రంలో చర్చలు జరుగుతున్నాయని.. 60 శాతం చర్చలు పూర్తయ్యాయని తెలిపారు. విభజన వల్ల రాష్ట్రానికి చాలా నష్టం జరిగిందని.. రాష్ట్రాన్ని కరువు నుండి కాపాడుకోవాలంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని.. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయిం చినట్లు తెలిపారు. కాగా పపన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ఎంపీలపై చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుతూ పవన్‌కళ్యాణ్‌ ఎంపిల పనితీరుపై సూచన చేశారని, ఆయన చేసిన వ్యాఖ్యలను కూడా ఒకసారి పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. హైదరాబాదులో సెక్షన్-8 అమలుపై కేంద్రానికి మరోసారి విన్నవించుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు.