తెదేపా ఏపీ, తెలంగాణా, కేంద్ర కమిటీల ప్రకటన
posted on Sep 30, 2015 11:55AM
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం ఆంద్రప్రదేశ్, తెలంగాణా, కేంద్ర పోలిట్ బ్యూరో కమిటీల వివరాలను విజయవాడలో ప్రకటించారు. తెదేపా ఆంద్రప్రదేశ్ అధ్యక్షుడిగా కళా వెంకట్రావును, తెలంగాణా అధ్యక్షుడిగా మళ్ళీ యల్. రమణను నియమించారు. చంద్రబాబు నాయుడు తెదేపా జాతీయ అధ్యక్షుడుగా వ్యవహరిస్తారు. నారా లోకేష్ కేంద్ర కమిటీ కార్యదర్శిగా నియమింపబడ్డారు.
ఆంద్రప్రదేశ్ : ఈ కమిటీలో అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ మొత్తం 70మంది సభ్యులను నియమించారు. అధ్యక్షుడు: కళా వెంకట్రావు, ఉపాధ్యక్షులు: కారణం బలరామ్,బండారు సత్యనారాయణ, వెంకటేశ్వర చౌదరి, జె.ఆర్. పుష్పరాజ్, ఎం. సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులు: వార్ల రామయ్య, బుచ్చయ్య చౌదరి, రెడ్డి సుబ్రహ్మణ్యం, నాగేశ్వర్ రెడ్డి, రామానాయుడు, అధికార ప్రతినిధులు: డొక్కా మాణిక్యవర ప్రసాద్, జూపూడి ప్రభాకర్, వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్, ముళ్ళపూడి రేణుక,ముత్తం శెట్టి శ్రీనివాస రావు, అనురాధ, లింగారెడ్డి, కోశాధికారి: బిసి. జనార్ధన్ రెడ్డి.
తెలంగాణా: ఆంద్రప్రదేశ్ కంటే తక్కువ జిల్లాలు ఉన్నప్పటికీ తెలంగాణాలో పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో తెలంగాణా రాష్ట్ర కమిటీలో 93మంది సభ్యులను నియమించారు. అధ్యక్షుడు: ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్: రేవంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు:ఎం. వెంకటేశ్వర రావు, సాయన్న, స్వామీ గౌడ్, యూసఫ్ ఆలి, కృష్ణ యాదవ్, ఎ. గాంధీ, సి.హెచ్. సురేష్ రెడ్డి, అన్నపూర్ణమ్మ. తెలుగు యువత అధ్యక్షుడు: వీరేందర్ గౌడ్, తెలుగు మహిళ అధ్యక్షురాలు: శోభారాణి
కేంద్ర కమిటీ: కేంద్ర పోలిట్ బ్యూరో సభ్యులు: నందమూరి హరికృష్ణ, యనమల, అయ్యన్న, ప్రతిభా భారతి, అశోక్ గజపతి రాజు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, చిన్న రాజప్ప, కాల్వ శ్రీనివాసులు, మోత్కుపల్లి, ఎర్రబెల్లి, దేవేందర్ గౌడ్, నామా నాగేశ్వర రావు, రమేష్ రాథోడ్, ఉమా మాధవ రెడ్డి, తదితరులు. అధికార ప్రతినిధులు: కే.రామ్మోహన్ నాయుడు, అరవింద్ కుమార్ గౌడ్, బోండా ఉమా.