ఏపీ ఇంటలిజన్స్ చీఫ్ అనురాధ బదిలీ

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుదితో సహా మంత్రులు, ఉన్నతాధికారుల ఫోన్లను తెలంగాణా ప్రభుత్వం ట్యాపింగ్ చేయించందని ఆరోపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఇంటలిజెన్స్ విభాగం ఆ కుట్రను సకాలంలో పసిగట్టి తమను హెచ్చరించలేకపోయినట్లు భావిస్తోంది. బహుశః అందుకే రాష్ట్ర ఇంటలిజెన్స్ చీఫ్ అనురాధను విజిలెన్స్ శాఖకు అదనపు డిజిగా బదిలీ చేసింది. ఆమె స్థానంలో ఇంతవరకు విజయవాడ పోలీస్ కమీషనర్ గా వ్యవహరించిన వెంకటేశ్వర రావును నియమించింది. ఆయన స్థానంలో గౌతం సవాంగ్ ను పోలీస్ కమీషనర్ గా నియమించింది.