కేంద్రమంత్రికీ తప్పని వేధింపులు

 

కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్‌ కీ ఆకతాయిల వేధింపులు తప్పలేదు.. తనని ముగ్గురు ఆకతాయిలు వేధించారంటూ ఆమె పోలీసులకి ఫిర్యాదు చేసారు.. ఆమె తన స్వంత నియోజకవర్గం మీర్జాపూర్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వారణాసి వెళ్తుండగా.. కొందరు ఆకతాయిలు నెంబర్ ప్లేట్ లేని కారులో, తన కాన్వాయిని ఫాలో అవుతూ.. తనని, తన సిబ్బందిని దుర్భాషలాడినట్టు ఆమె ఆరోపించారు.. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఆ ఆకతాయిల్ని పట్టుకున్నట్టు తెలుస్తుంది..ఈ ఘటనతో, కేంద్రమంత్రి పరిస్థితే ఇలా ఉంటే సామాన్య మహిళల పరిస్థితి ఏంటంటూ అక్కడ సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.