నేడు రాజమండ్రిలో మంత్రివర్గ సమావేశం

 

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ రాజమండ్రిలో మంత్రివర్గ సమావేశం జరుగబోతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా పుష్కరాల నిర్వహణ, లోటుపాట్లు ఇంకా చేప్పట్టవలసిన చర్యల గురించి చర్చిస్తారు. రాజధాని మాస్టర్ ప్లాన్ ఇప్పుడు ప్రభుత్వం చేతికి వచ్చింది కనుక తరువాత మొదలుపెట్టవలసిన కార్యక్రమాల గురించి చర్చిస్తారని సమాచారం. అదేవిధంగా వర్షాకాల అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారు చేయవచ్చును. ఇవికాక పరిపాలన సంబంధమయిన ఇతర అంశాలపై కూడా చర్చిస్తారు.