బాహుబలి ఫీవర్... థియేటర్ మొత్తం బుక్ చేసిన కలెక్టర్...

 

ప్రస్తుతం హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది బాహుబలి 2 గురించే. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చెప్పుకుంటున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ బాహుబలి ఫీవర్ ఎక్కువవుతోంది. అభిమాన హీరో అన్న తేడా లేకుండా అందరూ సినిమా చూడటానికి ఉర్రూతలూగుతున్నారు. టికెట్ ఎంతైనా పర్వవాలేదు.. ఎంత పెద్ద క్యూ ఉన్నా పర్వాలేదు ఎన్ని గంటలైనా లైన్లో నిల్చొని.. ఎంతైనా కొనేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ బాహుబలి 2 ఫీవర్ ఉన్నత అధికారులకు కూడా బాగానే ఎక్కినట్టుంది. బాహుబలి 2 కోసం ఏకంగా థియేటర్ మొత్తాన్ని బుక్ చేశారు ఓ కలెక్టర్ గారు. ఇంతకీ ఆ కలెక్టర్ ఎవరనుకుంటున్నారా..? వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి. ఆమె ఒక్కరే  హన్మకొండలోని ఏసియన్ మాల్‌లో 350 టికెట్లు బుక్ చేయింటారు. అయితే ఇన్ని టికెట్లు ఎందుకు? అని ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. గత కొద్ది రోజులుగా వరంగల్ నగరంలో సుందరీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, ఆర్టిస్టులు అంతా కలుపుకొని సుమారు 300 మంది ఉన్నారట. వారికి కాస్త రిలీఫ్ గా ఉండటానికి అమ్రపాలి అందరికీ టికెట్లు బుక్ చేశారంట.