సౌత్ సీఎంల ఆగ్రహం... మీ సొంత సొమ్ము ఇస్తున్నారా...!


ఓ సినిమాలో లక్ష రూపాయలు జేబులో పెట్టుకుని తిరిగే కమెడియన్ సునీల్.. కనబడివారికల్లా ఇస్తానంటాడు. కానీ చివరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వడు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా… అంతే.. ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్రానికి ఓ లెక్క తీసుకెళ్తారు. అందులో కనీసం రెండు నుంచి ఐదు లక్షల కోట్లు ఉంటాయి. అక్కడ ఉన్నది… బీజేపీ ప్రభుత్వమైతే… వారి బానిసలే కాబట్టి నోరు మూసుకుంటారు. కానీ దక్షిణాదితో పాటు బెంగాల్ లోనూ … ఉన్నది నిఖార్సైన ప్రభుత్వాలు కాబట్టి… అమిత్ షా… పొలిమేర దాటక ముందే కొర్రు కాల్చి వాత పెట్టేస్తూంటారు.

 

ఎవడబ్బ సొమ్ము.. మా డబ్బు మాకే ఇస్తున్నారు కదా.. ఇవి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆగ్రహంతో మాట్లాడుతున్న మాటలు. అంతలా ఎవర్ని తిడుతున్నారబ్బా అనుకుంటున్నారా...? ఎవరినే కాదు అమిత్ షాని.  అమిత్ షా పై నిప్పులు చెరుగుతున్నారు. ఎందుకంటే.. ఎక్కడికి ప్రచారానికి వెళ్లినా.. ఒకటే పాట పాడుతున్నారు. ఏ రాష్ట్రానికి వెళ్లినా.. మేం ఈ రాష్ట్రానికి ఇన్ని లక్షల కోట్లు ఇచ్చాం.. అని చెప్పడంతో ప్రతిపక్షపార్టీలకు మండిపోతుంది. ఇటీవల తెలంగాణ వచ్చి ఇలాంటి కూతలే కూస్తే దానికి కేసీఆర్ స్పందించి అమిత్ షాకి దిమ్మతిరిగేలా ఆన్సర్ ఇచ్చి నోరుమాయించారు.  మీ అబ్బసొమ్ము ఇస్తున్నావా అని నిలదీసేసరికి సౌండ్ లేదు. ఒక్క తెలంగాణయే కాదు... ఈ మధ్య ఎన్నికల ప్రచారానికి కర్ణాటకకు వెళ్లారు. అక్కడ కూడా కర్ణాటకకు రెండు లక్షల కోట్లిచ్చామని.. సిద్ధరామయ్య తినేశాడని అన్నాడు. అంతే దానికి సిద్దరామయ్య కూడా వెంటనే ప్రెస్ మీట్ పెట్టి లెక్కలు మొత్తం బయటపెట్టి అమిత్ షాను కడిగిపారేశారు. కర్ణాటక నుంచి కేంద్రానికి వెళ్తున్న సొమ్ములో కేవలం 30 పైసలే తిరిగి వస్తోందని .. మిగతా సొమ్ము ఎక్కడి పోతుందని ప్రశ్నలు గుప్పించారు. ఇక ఆ తర్వాత ఒడిషా, కేరళల్లోనూ అదే లక్ష కోట్లు లెక్క. చివరికి బెంగాల్ కు వెళ్లి.. అక్కడా అదే ప్రచారం చేపట్టారు. ఇప్పుడు ఏపీ విషయంలో కూడా అదే చేశారు. ఏపీ చాలా ఇచ్చామని అదే పాట పాడారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మండిపోయింది. రాష్ట్రాల సొమ్ము తిని కేంద్రం.. రాష్ట్రాలకే ఇస్తూ.. వారికేదో తాము సాయం చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తుందని మండిపడ్డారు.

 

దీంతో మోడీ వల్ల సగం వ్యతిరేకత రాగా.. ఇప్పుడు అమిత్ షా వల్ల ఇంకా వ్యతిరేకత పెరిగిపోయింది. కేంద్రానికి ప్రత్యేకంగా ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది... డబ్పులు ఆకాశం నుండి ఏమైనా రాలిపడుతున్నాయా.... కాదు కదా...  కేంద్ర పన్నులు అంటూ ప్రత్యేకంగా రాష్ట్రాల నుంచే వసూలు చేస్తోంది... ఆ డబ్బే మాకు ఇస్తుంది కదా అని మండిపడుతున్నారు. మరి రాజ్యాంగ ప్రకారం రాష్ట్రాలకు నిధులు ఇస్తున్నారు కానీ... మరి మోడీ, షా తమ జేబుల్లోంచి ఇచ్చినట్టు ఫీలవుతున్నట్టున్నారు.