మరికొందరికి ఏసిబి నోటీసులు?

 

తెలంగాణా ఎసిబి అధికారులు ఓటుకి నోటు కేసులో విచారణకు హాజరుకమ్మంటూ నిన్న మరికొందరికి నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. వారిలో తెదేపాకు చెందిన ప్రదీప్, సుధీర్ బాబు, రాఘవేంద్ర రెడ్డి ఉన్నారు. వారి ముగ్గురినీ ఈరోజు ఉదయం 10.30లోగా ఏసిబి కార్యాలయంలో విచారణకు హాజరు కావలసిందిగా ఆదేశిస్తూ నోటీసులు పంపారు. ఇంతకు ముందు తెదేపా నేత వేం నరేందర్ రెడ్డి, ఆయన కుమారడు కృష్ణ కీర్తన్, వారి కారు డ్రైవర్లని ప్రశ్నించారు.