ఆడవాళ్లు అర్ధ్రరాత్రి తిరగాలంటే.. ఆప్ ఎమ్మెల్యే

 

ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటివరకూ పలువురు నాయకులు పలు వివాదాల్లో చిక్కుకొని జైలుకు ఆఖరికి పదవులు కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కొత్తగా సోమనాథ్ భారతి చేసిన వ్యాఖ్యలు పార్టీకి తలనొప్పిగా మారాయి. గతంలో ఒకసారి ఈ ఎమ్మెల్యే మీద తన భార్య గృహహింస చట్టం కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈయన గాంధీ తరహాలో వ్యాఖ్యానించినా అది పలు విమర్శలకు దారితీసింది. అయితే గాంధీ గారు అర్ధ్రరాత్రి ఆడవాళ్లు ఒంటరిగా తిరగగలిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు అని చెపితే ఈ ఎమ్మెల్యేగారు దాని కాస్త కొంచం వ్యంగ్యంగా అందమైన అమ్మాయిలు అర్ధ్రరాత్రి స్వేచ్ఛగా తిరగాలంటే పోలీసు వ్యవస్థ ఆప్ చేతిలో ఉండాలని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు దీంతో సోమనాథ్ భారతి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు చెలరేగాయి. ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకురాలు స్పందించి సోమనాథ్ వ్యాఖ్యలు వికారం తెప్పిస్తున్నాయని.. ప్రతి అక్షరం మహిళను అగౌరపరిచేదిగా ఉందని విమర్శించారు. అటు బీజేపీ కూడా సోమనాథ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

 

ఇదిలా ఉండగా ఈ విమర్శలకు స్పందించిన సోమనాథ్ పోలీసు వ్యవస్థ మా చేతిలో ఉంటే మహిళలకు పూర్తి భద్రత కల్పిస్తామని.. ఓ మహిళ ఒంటినిండా నగలు ధరించి నడిరాత్రి స్వేచ్ఛగా బయట తిరగడం మహిళా రక్షణకు సంబంధించినంతవరకూ గొప్ప విషయం కాదా.. అలాంటి భద్రతే మేం కల్పిస్తామని చెపుతున్నామని.. పైగా అదే తన ఉద్దేశమని తన వ్యాఖ్యలను కప్పిపుచ్చుకున్నా