వెంకన్నను చూడాలంటే ఆధార్ కావాలట

ఇకపై వెంకన్న దర్శనానికి వెళ్లలాంటే కానుకలతో పాటు మరోకటి ఉంటేనే స్వామి దర్శనం కలుగుతుందట. అది వేరే ఇంకేదో కాదు..ఆధార్ కార్డు. బ్యాంక్ ఖాతా, పాన్ కార్డ్‌లకు ఆధార్ అనుసంధానాన్ని సుప్రీంకోర్టు సమర్థించిన నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి కూడా ఆధార్‌ను తప్పనిసరి చేయాలని టీటీడీ భావిస్తోంది. తొలి విడతగా ప్రత్యేక దర్శనం, ఆర్జిత సేవలు, నడకదారిలో ఆధార్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. దీని వల్ల అక్రమాలను మరింత సులువుగా అరికట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే ఆధార్ అమలుపై ఇప్పటికిప్పుడే ఒత్తిడి తీసుకురాబోమని, దీనిపై భక్తుల్లో విస్తృతంగా ప్రచారం కల్పించిన తరువాత అమల్లోకి తీసుకువస్తామని అంటున్నారు.