హుజూర్ ఉప ఎన్నికల్లో టిడిపి పరిస్థితేంటి..?

టిడిపి హుజూర్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయలేదు, అది చాలా తప్పుడు సంకేతం వెళ్లింది, కార్యకర్తలందరూ కూడా చాలా నిరుత్సాహపడిపోయారు కానీ, ఇప్పుడు మరోసారి తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తామని చంద్రబాబు చెబుతున్నారు. వారానికి రెండు రోజులు హైదరాబాద్ లో ఉంటూనే పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా కూడా సమీక్షలు చేస్తూ కొంత యువ నాయకులను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నిక వచ్చిన సందర్భంలో టిడిపి నాయకులు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన మిగిలిన టిడిపి నాయకులు కూడా నర్సిరెడ్డి లాంటి నాయకులకి టికెట్ ఇస్తే కొంత టిడిపికి ఉత్సాహం వచ్చే అవకాశం ఉంది.

అయితే, నర్సిరెడ్డి ఇప్పటికే అన్ని కార్యక్రమాల్లో స్టేజ్ పై మాట్లాడుతూ కొంత యాక్టివ్ గా ఉన్నారు. ఇలాంటి నాయకులని ప్రోత్సహిస్తే మరోసారి టిడిపికి కొంత ఊపు వచ్చే అవకాశముంటుంది. కాబట్టి ఈ ఎన్నికను ఉపయోగించుకోవాలని టిడిపి సీనియర్ నాయకులు చెప్తున్నారు. కానీ ఇది అంత సులభంగా జరిగే పని కాదు, ఖర్చు ఒక ఎత్తయితే ఇప్పుడు పోటీ చేస్తే, పోటీలో వచ్చే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, పోటీ కారణంగా లాభనష్టాలు ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పోటీకి నిలబడాలి. కాని, నాయకుల చెబుతున్నట్టుగా పోటీ చేసినంత మాత్రాన పార్టీ బలోపేతం అయ్యే పరిస్థితి అయితే కనిపించట్లేదనే చెప్పాలి.కానీ, చంద్రబాబు వ్యూహం ఏ విధంగా ఉంటుందనేది చూడాలి.

ఇప్పుడు పోటీ చేస్తే లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుంది అని చంద్రబాబు ఆలోచించే అవకాశాలున్నాయి. దీంతో నర్సిరెడ్డి లాంటి నాయకులు నిరుత్సాహపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా నాయకులను గుర్తించి , వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ప్రోత్సహించే ప్రయత్నాలైతే టిడిపి నాయకులు చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం సరైన నిర్ణయం కాదని టిడిపి సీనియర్ నాయకులు అనుకుంటున్నారు. కాకపోతే భవిష్యత్తులో మాత్రం పట్టు వదలకుండా నియోజకవర్గాల వారీగా నాయకులని ప్రోత్సహించే ప్రయత్నం మాత్రం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుందని, తెలంగాణ లో మరొక్కసారి మంచి రోజులొస్తాయనే ఆలోచనలో తెలంగాణ టిడిపి ఉన్నట్టుగా తెలుస్తోంది.