దేశాధినేతల గుట్టు రట్టు..

 

గత ఏడాది నవంబర్ లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ లో జీ-20 తొమ్మిదో శిఖరాగ్ర సదస్సు జరిగిన విషయం తెలిసిందే. భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు 31 మంది వివిధ దేశాధిపతులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి డేటాను సేకరించారు. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా అధికారులు ఆ దేశాతిపతుల నుంచి సేకరించిన వివరాలను పొరపాటున ఇంటర్ నెట్లో పోస్ట్ చేశారు. ఈ డాక్యుమెంట్లో నాయకుల పాస్పోర్టు వివరాలతో పాటు వ్యక్తిగత అంశాలు కూడా ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్, జర్మన్ చాన్సలర్ మార్కెల్, చైనా అధ్యక్షుడు జింపింగ్, జపాన్ ప్రధాని షింజో అబే, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ తదితరుల వ్యక్తిగత వివరాలు బయటకు వెల్లడయ్యాయి.