ట్రిపుల్ తలాక్ పై వెనక్కి తగ్గిన ముస్లిం లా బోర్డు...

 

ట్రిపుల్ తలాక్ అంశంపై గతకొద్దిరోజులుగా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.  అయితే దీనిపై తుది తీర్పు ను మాత్రం సుప్రీంకోర్టు రిజర్వ్ లో పెట్టింది. నిపుణుల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకున్న తర్వాత క్షుణ్ణంగా చర్చించి జూలై నెలలో తుది తీర్పు వెల్లడించనుంది. అయితే ఇప్పుడు ట్రిపుల్ తలాక్ విషయంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో 13 పేజీల అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో ట్రిపుల్ తలాక్ సరైన విధానం కాదని పేర్కొంది. ట్రిపుల్ తలాక్ ను ఆమోదించవద్దని దేశంలోని ఖాజీలకు సమాచారం ఇస్తామని తెలిపింది.