Next Page 
కాలనాగు పేజి 1

                              కాలనాగు
                                                 -- యామినీ సరస్వతి

    సాయంకాలం సూర్యుడు క్రమంగా చల్లబడి పోతున్నాడు. ఉదయారుణ కాంతులు ఎర్రబడి తెల్లనై ధగధగలాడి క్రమశః కాలపరిణామము చెంది యిప్పుడు బంగారు కాంతులు వెదజల్లుతున్నాయి.

    పడమటి దిశాముఖంగా కూర్చుంది సంధ్య
    ఆమె కెదురుగా కూర్చున్నాడు ఆదిత్య


    ఆమె చేయి అతని చేతిలో వుంది. మృదువుగా నిమురుతున్నాడు. అంతాదాకా ఏదో గంభీరమైన చర్చ జరిగినట్టుగా ఇద్దరి ముఖాల్లో కూడా తీవ్రత కన్పిస్తోంది.

    'అనుకోకుండా అవాంతరం వచ్చింది!' అంది సంధ్య డానికి అతనేం జవాబు చెప్పలేదు. ఏదో అలోచిస్తున్నట్టుగా' సంధ్యా, కాలం పగబట్టిన పాములాంటిది, అది తరిమి కొడుతుంది జనాల్ని. మనం జాగ్రత్తగా లేకపోతే నాశనం అవుతం' అన్నాడు


    'ఇప్పుడేం చేద్దామంటావు?' కనురెప్పలు తాటిస్తూ అడిగింది. ఆమె కంఠంలో ప్రేమ వుంది. నువ్వేం చెబితే అది చేస్తానన్న భరోసా వుంది నువ్వు చెబ్తే కాదంటానా అన్నా హమీ  వుంది.

    మనం పెళ్ళి చేసుకుందాం?' స్థిరంగా అన్నాడు
    "నువ్వు మళ్ళీ మొదటి కొచ్చావ్?"
    'ఏమిటి?'
    'మా ఇంట్లో యిప్పుడే పెళ్ళి చేయ్యరు?'
    'ఏం?'


    'ఏదో మొక్కు చెల్లుబడి కావాల్ట?'
    'మనకి-మొక్కుకి ఏం సంబంధం?'
    'డైరెక్ట్ సంబంధం లేదు. కానీ మ అమ్మకి నా పెళ్ళి అనగానే పూనకం వస్తుంది. వాళ్ళు తెలీయకుండా ప్రవర్తిస్తుంది. ఏవేవో శాపనార్దాలు పెడుతుంది. అది జరిగాక ఏదో అనర్ధం జరుగుతుంది!'

    "మీ వాళ్ళకి తెలీయకుండా పెళ్ళి చేసుకుందాం?"
    అతనా మాట అంటూ వుండగానే వాళ్ళు కూర్చున్నా చెట్టుపైనుంచి ఏదోదబ్బున పడింది.అది సంధ్య ప్రక్కన్నేపడ్డది చప్పున అటు చూసిన సంధ్య కేవ్వుమంది.


    నల్ల త్రాచుపాము బుస్సుమంది. అడుగెత్తిన లేచి బుస్సుమంది మళ్ళీ. కదిల్తే కాటువేస్తానన్నట్టుగా కనుగుడ్లు మిరమిర లాడిస్తోంది.
    సంధ్యకు చెమటలు కమ్ముతున్నాయి.
    ఆదిత్య విభ్రాంతితో చూస్తున్నాడు.


    సంధ్య అ ప్రయత్నంగా చేతులు జోడించింది. స్వామీ! నా అపరాధం మన్నించు..." అని లోగోంతుతో ప్రార్దించింది.
    అది టౌన్లోకెల్లా పెద్ద పార్కు. దాదాపు వందేళ్ళానాడు నిర్మించిన పార్కు అన్నీ పెద్దపెద్ద వృక్షాలు, ఎటు చూసినా దట్టమైన పచ్చిక. పార్కు గోడల వెంట పుట్టలు, పొదలు... జనం వుమ్డుగా వున్న పదిహేను ఎకరాల విస్తీర్ణంలో వున్న ఆ పార్కులో తలోమూల చెల్లాచెదురై నట్టుగా కూర్చిని వుంటారు.


    ఆదిత్య చప్పున లేచినుంచుని పారిపోవాలని చూస్తున్నాడు. కానీ కదిల్తే కాటువేస్తానన్నట్టుగా పడగెత్తి మరీ పొంచి వుంది నల్లత్రాచు. ఒకవేళ తాను తప్పించుకున్నా సంధ్య తప్పించుకోవడం అసాధ్యం.


    తను సంధ్యని వదలి వెళతాడా?
    ఊహూ తన ప్రాణం. తన సర్వస్వం సంధ్య.
    సంధ్య చేతులు అలాగే జోడించి వున్నాయి.
    పడగెత్తిన తాచు మెల్లగా దించుకుంది తన పడగని. పడగని తిప్పకుండానే కళ్ళు అటూఇటూ తిప్పింది. చంగుమని చేట్టుచాటుకి దూకింది జరజర పాకుకుంటూ వెళుతున్నశబ్దం. ఎటు వెళ్ళిందో పాము!


    పాము వెళ్ళిపోయినా కొన్ని క్షణాలకి సంధ్య తేరుకుంది.
    "దితీ::"
    "భయపడకు సంధ్యా: పాము వెళ్ళిపోయిందిగా:"


    నిట్టూర్చింది సంధ్య: భయం_యిప్పుడు తీరింది. అంతేకానీ సమస్య తీరలేదు.
    "నన్ను బాగా ఆలోచించనివ్వు_
    దితీ! నా బ్రతుకు యిలాగే మ్రోడులా తెల్లారిపోవాల్సిందేనా?" జాలిగా అడిగింది.


    అతని దవడ కండరాలు బిగుసుకున్నాయి. పిడికిళ్ళు బిగిసుకున్నాయి."ఊహూ  సంధ్యా! నిన్ను పెళ్ళి చేసుకుంటాను. దాని కోసం నా ప్రాణమైనా వేలకొడతాను' అన్నాడు.
    సంధ్య జవాబు చెప్పలేదు.
    సంధ్య చిక్కబడి చీకట్లు ముసురుకుని రాత్రి అవుతున్నాట్టుగానే సంధ్య ముఖంలో కూడా ఆలోచనా కారుమేఘాలు కమ్ముకున్నాయి.
    ఇద్దరూ పార్కు గేటుదాటి బయటకి వచ్చారు.
    'రేపు మీ యింటికి వస్తాను'


    'ఎందుకు!" కనుబొమ్మలు ముడివేస్తూ ప్రశ్నించింది
    'మీ అమ్మగారితో మాటాడతాను మీ అత్తయ్య గారిని అడుగుతాను మీ నాన్నగారిని....
    "ఆయన్నడిగి లాభం లేదు_"


    "ఎందుకు?" ఖంగుంమంది అతని కంఠం
    "అయన యీ ప్రపంచానికి చెందిన వ్యక్తికాదు ఈ లోకం తెలీదు. తనూ, తన నాగపూజ సుబ్రహ్మణేశ్వర జపం, కార్తికేయ వ్రతం అంతే మరో మాట తెలీదు మరో ముచ్చట తెలీదు_"
    "అంతా సర్పమయం_"


    "అవును. అయన ఊపిరి పీలిస్తే పాము బుసకోట్టినట్టుగా వుంటుంది. కదిల్తే సర్ప నృత్యంలాగా వుంటుంది. తలాడిస్తే పాము పడగ ఎక్కువే స్నేహం వుంది. అయినా ఏనాడూ అతనా యింటికి వెళ్ళలేదు.
    సంధ్య ఆ కుంటుంబ విషయాలు చెప్పలేదు.


    అతను ప్రశ్నిస్తే ఆమె మౌనం వహించేది అతన్నేనాడూ ఇంటికి ఆహ్వానించలేదు. ఎప్పుడు కలుసుకున్నా కోవెల్లోనో, హొటల్లోనో అంతే!
 


Next Page 

  • WRITERS
    PUBLICATIONS