కన్య రాశి - (2018-2019)

 

 

కన్యా రాశి - ఉత్తర ఫల్గుణి 2,3,4( టో, పా, పీ)

హస్తా 1,2,3,4 ( పూ, ష, ణా, రా) - చిత్త 1, 2 ( పె,పో)

ఆదాయము 14  వ్యయం 2 రాజపూజ్యం 6 అవమానం 6

    ఈ రాశి వారికి 11-10-2018 వరకు గురువు 2వ స్థానంలో తదుపరి 29-03-2019 వరకు 3వ స్థానంలో తదుపరి వత్సరాంతం 4వ స్థానంలో ఉండును. శని వత్సరమంతా 8వ స్థానంలో, రాహు, కేతువులు 7-03-2019 వరకు 11, 5 స్థానాల్లో తదుపరి వత్సరాంతం 10, 4 స్థానాల్లో ఉందురు.

    మీలో ఎంత శక్తి సామర్థ్యములు, ప్రజ్ఞా పాటవములు ఉన్ననూ తగు సమయంలో స్వయంగా ఉపయోగించుకోలేని పరిస్థితి ఉత్పన్నము అవుతుంది. మీరు ఇచ్చిన సలహాల వల్ల ఇతరులు ప్రయోజనాన్ని పొందటము చూసి ఆనందిస్తారు. కానీ మీకు మీరే నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ప్రతి పనికి ఒక పద్ధతిగా క్రమ శిక్షణగా అమలు చేసిన మేలు కలుగును. అయితే తొందరగా నిరాశ చెందకండా మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి. అతి శ్రీఘ్రముగా ఫలితలు మాత్రం ఆశించరాదు. విద్యార్థులు ఎక్కువగా శ్రమించాలి.అక్టోబర్‌ 11వ తేదీ వరకు గురు బలము అనుకూలము వల్ల ఆర్థిక సమస్యలు తొలగి, ఋణ బాధ తోలగి ఉండు ఊరుట కల్గును. పారిశ్రామిక వేత్తలు నూతన వ్యాపారముల కొరకు ఋణములు చేయవలసిన పరిస్థితి ఉత్పన్నం కావచ్చును. విద్యార్థులు తమ ఏకాగ్రత లోపం కాకుండా జాగ్రత్త పడాలి. విద్యార్థులు తమ ఉత్తీర్ణత శ్రేణి విషయంలో తృప్తి పడవలసి వచ్చును.  అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. అత్యాశతో అనర్థాలకు స్వాగతం పలకండి. క్రొత్తది సంపాధించుకున్నా ఉన్నది కాపాడు కోవడం ఉత్తమని గ్రహించండి. విదేశీయాన ప్రయత్నాలు ప్రయాసతో పూర్తి అయ్యే అవకాశం గలదు. వీలు అయినంత వరకు విదేశ ప్రయత్నాలు సురక్షితంగా చేయడం ఉత్తమము. సాంకేతిక పరమైన సమస్యలు  తలెత్త వచ్చును. వత్సరారంభములో అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. ప్రేమ వివాహాలు విఫలమయ్యే అవకాశము గలదు. ఈ విధమైన గ్రహస్థితిని పరిశీలించి చూడగా ప్రతి కార్యమును ఆరంభించే ముందు ఒకటికి రెండు మారులు ఆలోచించవలసిన పరిస్థితి ఎదురుకావచ్చును. ఏదో తెలియని అభద్రత మీ పై మీకై తెలియనటువంటి ఆత్మస్థైర్యము లోపించే అవకాశము గలదు. పైకి మాత్రము మీ గౌరవానికి, గాంభీర్యానికి లోటు రానివ్వడం కొందరి విషయంలో మౌనమే మీ సమాధానమవుతుంది. సాటి వారి ముందు తక్కువకాకుండా మీ ఆత్మాభిమానుము గౌరవమును కాపాడుకునే ప్రయత్నము చేస్తారు. మీ ప్రవర్తన, ధర్మ మార్గాచరణం మీ ధైర్యము అనేక సమస్యల నుండి కాపాడుతాయని తెలుసుకోండి. ఎదుటి వారిని అంత సులభముగా నమ్మకూడదని నిర్ణయించుకుంటారు. దగ్గరి స్నేహితులను కూడా సంశయాత్మకంగా చూడడము అలవాటుగా మారుతుంది. ఎట్టి పరిస్థితులలోను మధ్య  వర్తిత్వము జరుపుట, హామీలు ఇచ్చుట, ముఖ్యముగా వివాహ సంబంధాలు నిశ్చయ విషయంలో మధ్య వర్తిత్వము మొదలైన విషయాలలో తగు జాగ్రత్తలు అవసరము. వీలైనంతవరకు దూరంగా ఉండుట ఉత్తమము. మంచి చేయాలనుకున్నా ఎదుటివారు స్వీకరించే స్థితిలో ఉండకపోవడము మనస్సుకు బాధ కల్గించవచ్చును. వృధా ఖర్చులు అధికమవుతాయి. అనవసరమైన అవేశాలకు లోనవడము వలన మీ శ్రేయోభిలాషులు మనసును గాయపరచిన వారవుతారు. ద్వితీయ సంతానము యొక్క వివాహము విషయంలో నిర్ణయము తీసుకోవడం కష్టమవుతుంది. వీలైనంత వరకు కొంత సమయము వాయిదా వేయడము ఉత్తమము. చాలా విషయాలలో నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అను న్యాయాన్ని పాటిస్తారు. తమ సంతానము యొక్క విద్యా, ఉద్యోగ విషయంలో ఒకింత అసంతృప్తి ఉండవచ్చును. అయిననూ ఇది తాత్కాలికమని తెలుసుకోవాలి. ఆరోగ్య విషయమై ఏ మాత్రము అజాగ్రత్త పనికిరాదు. సమయానికి ఔషధ సేవనము విస్మరించడము తరుచుగా జరుగుతుంధి. ఎంతటి విపత్కర పరిస్థితులైనా ధైర్యముగా ఎదురుకుంటారు. తరువాత మీరే ఆశ్చర్యపడతారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఒకింత సోమరితనము, ప్రతి విషయాన్ని వాయిదా వేయడము, అకారణ వివాదాలు, గృహంలో అశాంతి ఇష్టం ఉన్నా లేకున్నా కొందరితో స్నేహం చేయకతప్పక పోవచ్చును. జీవిత భాగస్వామితో చాలా విషయాలు దాచవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. చెప్పుడు మాటలు విని చెడిపోవడం కన్నా నిజానిజాలు తెలుసుకొని నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమము. స్థానచలన అవకాశాలు గలవు. చాలా కాలంగా మిమ్మల్ని వేదిస్తున్న సమస్యకు పరిష్కారము లభిస్తుంది. తొందరపాటుతనము ఒకింత అహంభావము వలన కొంత నష్టము వాటిల్లవచ్చును. షుగర్‌, బిపి మొదలైన వ్యాధుల విషయంలో అశ్రద్ధ పనికిరాదు. తీర్ధయాత్రాఫలము దక్కుతుంది. తాత్కాలిక స్థానచలనం కనిపిస్తుంది. గృహంలో ఇంకొకరి ఆదాయం ఆరంభమగుట శుభ పరిణామం స్వస్థలము వదలి దూరంగా ఉండవలసిన పరిస్థితి లేదా తరచుగా ఉద్యోగరీత్యా లేదా వ్యాపారపరముగా పర్యటించవలసిన పరిస్థితి, స్థిర చరాస్థుల విషయంలో తీసుకునే నిర్ణయము శ్రేయోభిషుల సలహామేరకు తీసుకోవాలి. మీరు ఆశించిన ధరరాక, మధ్యవర్తులు లాభపడే పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశము గలదు. ఆర్థికపరమైన వివాదాలు, ఒకరికి సహాయము చేయాలని మీరే చికాకుల పాలు కావడం మొదలైన పరిస్థితులు గోచరించుచున్నవి. కుటుంబ ప్రశాంతతకు భంగం వాటిల్లును. అవసరమైన వివాదాలతో, అపార్థాలతో, సతమతమవడం, లాటరీలు, షేర్‌ మార్కెట్‌, జూదము, బెట్టింగులు మొదలైన వాటి జోలికి వెళ్ళకుండా ఉండుట శ్రేయోదాయకము, శుభకార్యా చరణకై అధిక ధనవ్యయము. స్త్రీ వివాదముతో మీడియా పరముగా ప్రతిష్ఠ దెబ్బతినుట. అకారణ శతృత్వాలు, బంధుమరణము వల్ల మానసిక వేదన, దుర్జన సహవాసము, ఊహించని పరిణామము. తమకు సంబంధము లేని విషయాలలో దోషులుగా పరిగణించుట, చెడు సలహాలు ఇచ్చేవారి పట్ల ఒకింత జాగ్రత్తగా ఉండాలి.  తమ ఆలోచనా విచక్షణ జ్ఞానాన్ని కొల్పోవుట, గతంలోని మీ ప్రవర్తనకు ప్రస్తుత మీ ప్రవర్థనకు తేడాను గమనిస్తారు. కాని ఏమి  చేయలేని పరిస్థితి, పరపతి, ప్రతిష్ఠకు ఇబ్బంది కలుగకుండా చూసుకుంటారు. వివాహంలో కొన్ని అడ్డంకులు ప్రభుత్వపరమైన విషయాలలో ఒకింత భయము. పనులు ఆలస్యము అవడము.

     కాలము ఎవరి కోసమూ ఆగదు. ఉన్న సమయాన్ని విజ్ఞతతో ఉపయోగించుకొని బాగుపడటం విజ్ఞుల లక్షణం. జీవితాశయము నెరవేర్చుకోవడానికి కృషిచేస్తారు. దాదాపు సఫలమవుతారు. తమకు సంబంధము లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి సమయం వృధా చేయకండి. సమాజంలో మనమూ ఒక భాగమే కనుక కాలానికి ఎదురీదే ప్రయత్నము మానుకొని నలుగురితో పాటు మనమూ అనే భావనకు వస్తారు. ఎదుటి వారిలో లోపాలను వెతకటం మానివేసిన చాలా మేలు జరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారు 2వ ప్రయత్నంగా సఫలం కావచ్చును. ఎక్కువగా శ్రమించాల్సిన పరిస్థితి కనబడుతున్నది. నూతన వ్యాపార ప్రవేశము జరుగవచ్చును. మీరు పెట్టుబడిగా పెట్టిన ధనము, ఇక రాదనుకొని నిర్ణయించుకున్న ధన విషయంలో శుభవార్త వింటారు. శుభకార్యా చరణ సత్కార్యాలకై ధనవ్యయము చేస్తారు.

    గతంలో అనుభవించిన అనేక సమస్యల నుండి ఉపశమనము లభిస్తుంది. పేరు ప్రతిష్ఠలు వృద్ధి చెందుతాయి. చాలాకాలంగా అనుభవిస్తున్న ఆరోగ్య సమస్యలకు వైద్యపరమైన పరిష్కారము లభిస్తుంది. సమాజములో గౌరవము ప్రతిష్ట పెరుగుతుంది. పరోక్ష ప్రత్యక్ష శతృవులు మీ స్నేహానికి ఆరాటపడతారు. అవివాహితులకు వివాహప్రాప్తి శుభకార్యాచరణ, ఉద్యోగస్తులకు తమ పదవిలో స్థాయిలో ఉన్నతి కలుగవచ్చును. వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి విసృత పరచడానికి ప్రయత్నాలు చేస్తారు. సఫలమవుతారు. ఒక స్థిరాస్థిని అమ్మదలచుకొని, చివరి నిమిషంలో విరమించుకునే అవకాశము గలదు. దాంపత్య సౌఖ్యాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తారు. సంఘ సేవా కార్యక్రమాలు  అనాథ శరణాలయాలు మొదలగు వాటికి హితోధికంగా సహాయం చేస్తారు. విద్యార్థులు చక్కగా తమ ప్రతిభా పాటవాలను వృద్ధి పరచుకుంటారు. మెరిట్‌ స్కాలర్‌షిప్‌లు పొందే అవకాశము గలదు. విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు. విలువైన ఆభరణాలు, ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి అయినా తాము ఆ ఉద్యోగములో పూర్తిగా సంతృప్తి చెందకపోవచ్చును. ఉద్యోగ విషయమై ప్రస్తుత స్థలాన్ని వదలి మరొక చోట నివసించవలసిన పరిస్థితులు రావచ్చును. సంతానప్రాప్తి గలదు. ముఖ్యంగా పుత్రసంతానాన్ని పొందే కోరిక తీరవచ్చును. మానసికమైన ధైర్యము పెరుగుతుంది. ఆలోచనా శక్తి ఆత్మస్థైర్యము పెరుగుతాయి. ప్రాపంచిక సౌఖ్యాలు మీ దరికి చేరుతాయి. స్త్రీ, సౌఖ్యము. కోరిన వారితో వివాహ సూచన. వంశపారంపర్య ఆస్తులు సంక్రమించుట మొదలైన శుభ పరిణామాలు. పౌరుషమైన దర్పంతో కూడిన జీవితము లభించవచ్చును. ఆదాయ మార్గాలు పెరుగుట. సైనస్‌ సంబంధిత సమస్యలు ఉత్పన్నము కావచ్చును. కొందరికి వివాహ విషయంలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితులు ఎదురుకావచ్చును. మంచి ఉద్యోగము లభించవచ్చును. స్థిరాస్థులు సంపాదించుట, వివాదంలో ఉన్న అస్తి మీ స్వాధీనమగుట. నూతన వ్యాపార ప్రారంభము. వ్యాపార భాగస్వాములపై ఆధిపత్యము చలాయించుట. మీ భాద్యతలను, వృత్తిని, విధులను చాలా సమర్థవంతముగా చురుకుగా నిర్వహిస్తారు. మీ ఆధీనంలో నడుస్తున్న సంస్థలలోగాని, లేదా ఉద్యోగంలోగాని కొందరిని అనగా మీకు పర్షోముగా సమస్యలు సృష్టిస్తున్న వారిని గుర్తించి వారిని ఆ స్థానమునుండి తొలగింపచేస్తారు. అధిపత్యాన్ని పొందుతారు. మీ స్థాయిని స్థానాన్ని పదిలపరచుకుంటారు. తమ తోబుట్టువులు వృద్ధిలోకి వస్తారు. చక్కని స్థానాన్ని పొందుతారు. స్వగృహము నిర్మించుకోవాలన్న కల నెరవేరుతుంది. వివాహప్రాప్తి దూరప్రాంత ప్రయాణాలలో తగు జాగ్రత్తలు అవసరము.

    రాహు, గురు, కేతు, కుజ జపధ్యానాలు చేయండి. సంక్షేప రామాయణం మేలు చేస్తుంది. ఆకలితో ఉన్నవారికి అన్నదానం, వస్త్రదానం, గోసేవ మీకు అన్ని విధాలా శ్రేయస్సు, భవిష్యత్తునిస్తుంది.

 

 


More Rasi Phalalu 2018 - 2019