ద్వాదశ జ్యోతిర్లింగాలు (శివరాత్రి స్పెషల్)
శివుని యొక్క జ్యోతి స్వరూపము వెలుగుతుంటుందని శైవుల నమ్మకం.. వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలుగా అత్యంత ప్రధానమైనవి ఉన్నాయి... అవి ఏమిటంటే...
1. రామేశ్వరం లోలని రామనాధ స్వామి లింగము....
2. శ్రీశైలములోని ... శ్రీశైల మల్లికార్జున లింగము...
3. భీమా శంకరం లోని.... భీమ శంకర లింగము...
4. ఘ్రుష్ణేశ్వరంలోని... ఘ్రుష్ణేశ్వర లింగము...
5. త్రయంబకేశ్వరంలోని... త్రయంబకేశ్వర లింగం....
6. సోమ్ నాధ్ లోని.... సోమ్ నాధ్ లింగం.
7. ద్వారకలోని....... నాగేశ్వర లింగం
8. ఓంకార క్షేత్రంలోని ఓంకారేశ్వర అమలేశ్వర లింగములు...
9. ఉజ్జయిని లో మహంకాళి లింగం
10. చితా భూమి లో వైద్యనాధ లింగం
11. వారణాశిలో విశ్వే శ్వరలింగం
12. కేదారేశ్వర్ లో కేదార్ నాధ్ లింగం...
ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను తలచుకుంటూ...
నిత్యం ప్రార్ధన చేసుకుంటే ....
ఏడేడు జన్మాలలో చేసిన పాపాలన్నీ పోతాయని...
భక్తులందరూ....ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని అంటారు...ఇంకెందుకు ఆలస్యం...
చేసుకోండి ద్వాదశ జ్యోతిర్లంగ పఠనం....
సౌరాష్ట్రే సోమనాథం చ, శ్రీశైలే మల్లికార్జునమ్
ఉజ్జయిన్యాం మహాకాళమ్, ఓంకారమమరేశ్వరమ్
ప్రజ్వాల్యాం వైద్యనాథంచ, డాకిన్యాం భీమశంకరమ్
సేతుబంధే తు రామేశం, నాగేశం దారుకావనే
వారాణస్యాం తు విశ్వేశం, త్ర్యంబకం గౌతమీ తటే
హిమాలయే తు కేదారం, ఘృష్ణేశం చ శివాలయే
ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః
సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి....
అంటూ ద్వాదశ జ్యోతిర్లింగ పఠనం చేసుకుంటే...
అందరూ హాయిగా ఆనందంగా ఉంటారు.
ఇంకెందుకు ఆలస్యం....చేసుకోండి పఠనం..
- కుల శేఖర్
