తులారాశి - చిత్త 3,4 (రా,రి)
స్వాతి 1,2,3,4(రూ,రే,రో,తా)- విశాఖ 1,2,3 (తీ,తు,తే)
ఆదాయము 11 వ్యయం 13 రాజపూజ్యం 5 అవమానం 6
ఈ రాశివారికి 11.8.16 వరకు గురువు 11వ స్థానములో రజితమూర్తియై ఉండును. తదుపరి వత్సరాంతం 12వ స్థానమున రజితమూర్తిగానే ఉండును. శని వత్సరాది 26.1.17 వరకు 2వ స్థానమున రజితమూర్తిగా తదుపరి వత్సరాంతము 11వ స్థానమున కేతువు 5వ స్థానమున లోహమూర్తులుగా ఉందురు.
ఈ విధమైన గ్రహస్థితి పరిశీలించి చూడగా ఈ రాశివారికి ఏలినాి శని చివరి సమయము మరియు కొంతవరకు శుభాశుభ మిశ్రమ ఫలితములు కనపడుతున్నవి. పూర్వార్థము గురు, రాహువులు అనుకూలము ఉన్నా గురుబలము ఉత్తరార్థంలో బలహీనంగా ఉండును. కొందరికి ఆకస్మిక ధనప్రాప్తి అవకాశం కలదు.
కొంతమేరకు అనుకూలతలు ఏర్పడవచ్చును. కోర్టు వ్యవహారములు మధ్యమార్గము ద్వారా పరిష్కారము అవుతాయి. మీ గురించి అపార్థము చేసుకున్నవారు నిజాన్ని గ్రహించి పశ్చాత్తాపపడతారు. శతృవులను ఎదురు కోవడంలో మీరు వేసే ఎత్తులకు ఎదుివారు చిత్తవుతారు. తమను అర్థం చేసుకునే వారు లేరనే నిరాశ, నిస్పృహ ఏర్పడుతుంది. చాలా కాలంగా మీరు ఏటూ తేల్చుకోలేక సతమతమవుతున్న సమస్యలపై తగిన నిర్ణయాలు తీసుకుాంరు. భూ వ్యాపారులకు కొంత అనుకూలము. ఉదరసంబంధమైన చికాకులు బాధించ వచ్చును. చిన్న సమస్యకైనా వైద్యుడిని సంప్రదించుట ఉత్తమము. విలువైన వస్తువులు కాగితములను అతి జాగ్రత్తవల్ల దాచిన చోటును మరిచి పోవడం ఒక సమస్యగా మారుతుంది. షుగరు, లివరు మరియు స్త్రీలకు సహజంగా ఉండే కొన్ని సమస్యలు చిరాకు కలిగించవచ్చును.
తరుచుగా ఉద్యోగ ధర్మములో తమ భాద్యతలు మారడం చికాకు కలిగించవచ్చును. పై అధికారులు ఏదో రకంగా సాధించడం విసుగు కల్గిస్తుంది. తరచూ స్థానచలనాలు ఏర్పడవచ్చును. సుఖవ్యాధులు, పొత్తి కడుపులో సమస్యలు బాధించవచ్చును. చాలా విషయాలలో మీ పొరపాటులేకున్నా మౌనముగా ఉండవలసిన పరిస్థితి తమ అత్యంత సన్నిహితులు సహోద్యోగుల అందరినీ సంశయించాల్సిన పరిస్థితి ఎదురుకావడము. జీవిత భాగస్వాములతో తరచూ అభిప్రాయభేదాలు గ్యాస్త్రిక్ సమస్యలు, నరాలు, కండరాలు, ఎముకలకు సంబంధించిన సమస్యలు. అనాలోచితంగా విలాసాలు, భోగాలకు, వ్యసనాలకు ధనవ్యయం ఎవరిని చూసినా ముందుగా వారి గురించి వ్యతిరేకంగా ఆలోచించడం జరుగవచ్చును. ఆధ్యాత్మిక దేవతాసేవలలో ఎక్కువగా పాల్గొాంరు.
ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది.సంశయాత్మకమైన స్వభావాన్ని అధిగమించినా అన్ని విధాలా శ్రేయస్కరం. ప్రస్తుతం శతృవులుగా ఉంటున్న మీ శ్రేయోభిలాషులు తిరిగి మీ చెంతకు చేరే అవకాశము గలదు. ఋణములు చేయునపుడు ముందు జాగ్రత్తలు పాించండి. స్త్రీమూలకముగా అనవసర చికాకులు, అనుమానాలు, అపోహలు రాకుండా జాగ్రత్త పడాలి. తన సొమ్ము అయినా దాచుకోవాలి. ప్రయాసచేత పనులు పూర్తి చేస్తారు. పెట్టుబడులు విషయమై, నూతన వ్యాపారాలలో ప్రవేశం గురించి కొద్దిగా వాయిదా వేసిన మేలు జరుగును. వాహనములు నడుపునపుడు శ్రద్ధ అవసరం. నిర్లక్ష్యం పనికిరాదు. సంతాన కలహములు, బంధవులతో సంబంధాలు కాస్త వికించుట బోరులవలన భయం, అగ్ని భయం, రాజభయం మొదలగు ఫలములు మరియు శని వలన ఆరంభంలో పాపకార్యాచరణ. గతంలో ఏర్పడిన అనేక సమస్యల నుండి సునాయాసముగా బయటపడతారు. రావాలసిన మొండి బకాయిలు చేతికందే అవకాశము గలదు. శతృవులు సైతం తమతో మైత్రి చేయడానికి ఆసక్తి చూపుతారు. తాము చేసిన పొరపాటును తెలుసుకొని పశ్చాత్తాప పడతారు. శ్రమకు తగిన ఆదాయం చేతికందుతుంది. గతంలో అనుభవించిన అనేక సమస్యల నుండి ఉపశమనము లభిస్తుంది. పేరు ప్రతిష్ఠలు వృద్ధి చెందుతాయి. చాలాకాలంగా అనుభవిస్తున్న ఆరోగ్య సమస్యలకు వైద్యపరమైన పరిష్కారము లభిస్తుంది. సమాజములో గౌరవము ప్రతిష్ట పెరుగుతుంది. పరోక్ష ప్రత్యక్ష శతృవులు మీ స్నేహానికి ఆరాటపడతారు. అవివాహితులకు వివాహప్రాప్తి శుభకార్యాచరణ, ఉద్యోగస్తులకు తమ పదవిలో స్థాయిలో ఉన్నతి కలుగవచ్చును. వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి విసృత పరచడానికి ప్రయత్నాలు చేస్తారు. సఫలమవుతారు. ఒక స్థిరాస్థిని అమ్మదలచుకొని, చివరి నిమిషంలో విరమించుకునే అవకాశము గలదు. దాంపత్య సౌఖ్యాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తారు. సంఘ సేవా కార్యక్రమాలు అనాథ శరణాలయాలు మొదలగు వాికి హితోధికంగా సహాయం చేస్తారు. విద్యార్థులు చక్కగా తమ ప్రతిభా పాటవాలను వృద్ధి పరచుకుాంరు. మెర్‌ి స్కాలర్‌షిప్‌లు పొందే అవకాశము గలదు. విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు. విలువైన ఆభరణాలు, ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి అయినా తాము ఆ ఉద్యోగములో పూర్తిగా సంతృప్తి చెందకపోవచ్చును. ఉద్యోగ విషయమై ప్రస్తుత స్థలాన్ని వదలి మరొక చోట నివసించవలసిన పరిస్థితులు రావచ్చును. సంతానప్రాప్తి గలదు. ముఖ్యంగా పుత్రసంతానాన్ని పొందే కోరిక తీరవచ్చును. మానసికమైన ధైర్యము పెరుగుతుంది. ఆలోచనా శక్తి ఆత్మస్థైర్యము పెరుగుతాయి. ప్రాపంచిక సౌఖ్యాలు మీ దరికి చేరుతాయి. స్త్రీ, సౌఖ్యము. కోరిన వారితో వివాహ సూచన. వంశపారంపర్య ఆస్తులు సంక్రమించుట మొదలైన శుభ పరిణామాలు. పౌరుషమైన దర్పంతో కూడిన జీవితము లభించవచ్చును. ఆదాయ మార్గాలు పెరుగుట. సైనస్ సంబంధిత సమస్యలు ఉత్పన్నము కావచ్చును. కొందరికి వివాహ విషయంలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితులు ఎదురుకావచ్చును. మంచి ఉద్యోగము లభించవచ్చును. స్థిరాస్థులు సంపాదించుట, వివాదంలో ఉన్న అస్తి మీ స్వాధీనమగుట. నూతన వ్యాపార ప్రారంభము. వ్యాపార భాగస్వాములపై ఆధిపత్యము చలాయించుట. మీ భాద్యతలను, వృత్తిని, విధులను చాలా సమర్థవంతముగా చురుకుగా నిర్వహిస్తారు. మీ ఆధీనంలో నడుస్తున్న సంస్థలలోగాని, లేదా ఉద్యోగంలోగాని కొందరిని అనగా మీకు పరోక్షముగా సమస్యలు సృష్టిస్తున్న వారిని గుర్తించి వారిని ఆ స్థానమునుండి తొలగింపచేస్తారు. అధిపత్యాన్ని పొందుతారు. మీ స్థాయిని స్థానాన్ని పదిలపరచుకుాంరు. తమ తోబుట్టువులు వృద్ధిలోకి వస్తారు. చక్కని స్థానాన్ని పొందుతారు. ప్రకాశిస్తారు. వాహనసౌఖ్యము గలదు. పాత వాహనముల చోట, క్రొత్త వాహనాలను సమకూర్చుకుాంరు. స్వగృహము నిర్మించుకోవాలన్న కల నెరవేరుతుంది. వివాహప్రాప్తి దూరప్రాంత ప్రయాణాలలో తగు జాగ్రత్తలు అవసరము. జీవిత భాగస్వామి మీ పట్ల వాస్తవము తెలుసుకొని, మీకు మీ యొక్క వ్యక్తిత్వానికి విలువనిస్తారు. సంతానము యొక్క పురోభివృద్ధి చక్కగా ఉంటుంది. జ్యేష్ఠ సంతానము యొక్క పురోభివృద్ధిలో శ్రమ ఎక్కువ అవసరము. చెవులకు, కింకి సంబంధించిన సమస్యలు బాధించవచ్చును. ఔషధసేవనము తప్పక పోవచ్చును. కళాకారులకు అనుకూలము. నూతన అయాచిత అవకాశాలు రావచ్చును. మీ చాతుర్యంతో, చాకచక్యంతో అనేక కార్యాలను సంపూర్తి చేస్తారు. భార్యాభర్తలకు చిన్న చిన్న వివాదాలు తప్ప చక్కని దాంపత్య జీవితము అనుభవిస్తారు. జీవితాశయము నెరవేరుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు ఒకింత జాగ్రత్తగా చేయవలెను. రాజకీయ పరపతి హోదా లభించును. బ్యాంకు ఋణాలు తీసుకొని నూతన వ్యాపారారంభం చేయవచ్చును.
. ఈ విధంగా ఈ రాశివారికి శుభఫలితాలు సంవత్సరం మధ్యకాలము నుండి అనుభవిస్తారు. ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు గురు,శని, రాహు, కేతు, జప దానాదులు చేసిన మంచిది. శ్రీ సుదర్శనస్తోత్రము, శ్రీ లక్ష్మీనృసింహస్తోత్రము, గణపతి స్తోత్రం దుర్వార్చన మొదలగునవి తమ తమ వంశాచార అనుసారముగా చేసిన మేలు జరుగును.
కొదుమగుళ్ళ వారి శ్రీదుర్ముఖినామ సంవత్సర పంచాగము 2016-17
