వృశ్చికరాశి - విశాఖ 4 (తో)
అనూరాధ 1,2,3,4(నా,నీ,నూ,నే), జ్యేష్ఠ 1,2,3,4 (నో,యా,యి,యు)
ఆదాయము 2 వ్యయం 8 రాజపూజ్యం 4 అవమానం 1
ఈ రాశివారికి గురువు 11.8.16 వరకు 10వస్థానములో లోహమూర్తిగా తదుపరి వత్సరాంతము 11వ స్థానమున సువర్ణమూర్తిగా ఉండును. శని వత్సరాది 26.1.17 వరకు జన్మస్థానమున లోహమూర్తిగా ఉండును. తదుపరి వత్సరాంతము 2వ స్థానమున రజితమూర్తిగా ఉండును. రాహువు వత్సరాది వత్సరాంతము 10వ స్థానములో కేతువు 4వ స్థానంలోను సువర్ణమూర్తులుగా ఉందురు.
ఈ రకమైన గ్రహస్థితి పరిశీలించి చూడగా ఏలినాి శని ప్రభావము తీవ్రముగా ఉన్ననూ గురుబలము ఉపశమనము కలిగించును. నూతన పరిచయాలు ఏర్పడతాయి. జీవితంలో ఆత్మస్థైర్యము. ధైర్యము పెరుగుతుంది. ఎలర్జీ విం సమస్యలు బాధించవచ్చును. ఈ సమస్య కొంత దీర్ఘకాలికంగా ఉండవచ్చును. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ఒకింత ధనవ్యయము, వీరికి తాంత్రిక, నరఘోష మొదలైన కక్షుద్ర విద్య బాధితులు అయ్యే అవకాశము గలదు. నిత్యము శ్రీలక్ష్మినృసింహ కరావలంబ స్తోత్రము పారాయణం చేయండి. అనేకమైన దృష్టశక్తులనుండి విముక్తి పొందండి. సంవత్సరాంతంలో గర్భధారణ సమస్యలు, విషజంతు పీడయు, నిర్లక్ష్యము, కిం మరియు దంత సమస్యలు బాధించుట, ఇతరులచే మోసగింపబడుట, అన్యస్త్రీ వివాదములు. కుటుంబములో తరచూ అకారణ కలహాలు, స్థలమార్పు గోచరించుచున్నది. రక్త సంబంధీకులకు అనారోగ్య సూచనలు. మధ్యవర్తుల ద్వారా అపోహలు, చెప్పుడు మాటలు వినుటద్వారా మానసిక అశాంతి కాళ్ళకు, పాదాలకు గాయాలు కాకుండా జాగ్రత్త పడండి. వాహనములు నడుపునపుడు జాగ్రత్త. అయినా కొద్దిపాి సమస్యలు ఎదురైననూ గతము అనుభవాల ప్రభావం చేత ఎత్తుకుపై ఎత్తులు వేసి ఆర్థికముగా అభివృద్ధి చెందుతారు. వృత్తి పరముగా వృద్ధిలోకి వస్తారు. మేన మామలకు ఆరోగ్యములో కొంత చికాకు కనిపించుచున్నది. పాండిత్య ప్రతిభ పెరుగుతుంది. గొప్ప పండితుడిగా చెలామణి అవుతారు. ఋణ బాధలు తొలగుతాయి. ఆధ్యాత్మిక, సేవా రంగాలలో ప్రవేశిస్తారు. సేవ చేస్తారు. ఒక ప్రాణ స్నేహితునికి మీ సహాయము అవసరమవుతుంది. సహాయము చేస్తారు. కోర్టులలో ఉన్న దంపతుల సమస్యలు మధ్యమార్గంగా పరిష్కరించుకుాంరు. మొండి పట్టుదలల చేత దాంపత్య సమస్యలు మీకై మీరు సృష్టించుకో కూడదు. జ్ఞాపకశక్తి తగ్గడం, అపనిందలు, భరించవలసివచ్చును. సమస్యలు వత్సరాంతంలో సంభవించవచ్చును. చేయని దోషమునకు మీరు సంజాయిషీ చెప్పుకోవడం బాధ కల్గించును. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారము లభిస్తుంది. విదేశీయానము కొరకు ప్రయత్నాలు శ్రద్ధగా చేయండి. ఫలితము లభిస్తుంది. పోీ పరీక్షలలో చక్కని విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యుల పరిపూర్ణ సహకారాన్ని పొందుతారు. ప్రభుత్వపరమైన కాంక్టులు లభిస్తాయి. ఖర్చులను నియంత్రించుకొనుట ఉత్తమము. అధికాశతో వివాదాస్పదమైన ఆస్తులను కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తారు. తస్మాత్ జాగ్రత్త. తమ సంతానానికి శుభకార్యాచరణ. తన కోపమే తన శతృవని తెలుసుకోవాలి. ఆవేశము అనర్థానికి కారణం కావచ్చును. విద్యార్థులకు అనుకూలంగా ఉన్నది. తాము కోరుకున్న స్థానాలలో ప్రవేశము లభించగలదు. వ్యవసాయదారులకు అనుకూలముగా ఉన్నది. మీ పరిచయానికి, స్నేహానికి ఇతరులు ఆసక్తి చూపుతారు. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణ సహకారం లభిస్తుంది. సంతానం యొక్క పురోగతి సంతృప్తి కరముగా ఉంటుంది. కన్యాదాన ఫలం దక్కుతుంది. ఉద్యోగములో ఉన్నతస్థానానికి వెళ్ళగలరు. కాని ఒకింత ఓపిక అవసరము. నిజం నిష్ఠూరంగా ఉంటుంది. కనుక తమ భావాన్ని అభిప్రాయాన్ని ఎదుివారు అర్థం చేసుకునే రీతిలో సాత్వికంగా తెలియజేయండి. విమర్శించే వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నము చేయండి. సాి వారి ముందు మీరు ఏమిో నిరూపించుకోవాలనే తపన పెరుగుతుంది. ఆ దిశలో ముందడుగు వేస్తారు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకు ఎక్కువగా అనుకూలంగా ఉన్నది. మంచి ప్రయోజనాలకై ధనవ్యయం చేస్తారు.
ఈ విధమైన గ్రహస్థితిని పరిశీలించి చూడగా శుభాశుభ మిశ్రమ ఫలములు కనపడుచున్నవి. గతం చాలా రోజుల నుండి అనుభవిస్తున్న అవస్థలు కొంతవరకు ఉపశమించినట్లు కనిపించినా ఇంకా ఫలితము చేతికి అందకపోయే సరికి ఒక విధమైన కంగారు ఏదో తెలియని అభద్రతా భావము ఏర్పడుతుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని అర్ధంకాని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగ విషయంలో ఏ విధమైనటువిం సాహస నిర్ణయాలు తీసుకోవడం మంచిదికాదు. సహనము, ఓర్పు ఇవి అలవరచుకోవాలి. చాలా కాలంగా ఉన్న సహనానికి ఒక పరీక్షా సమయము ఎదురుకావచ్చు. కాని మిమ్ములను అనేక విధాలుగా రెచ్చగోట్టే ప్రయత్నాలు చేస్తారు. తద్వారా మీరు చేసే పొరపాటును తమకు అనుకూలంగా త్రిప్పుకునే ప్రయత్నాలు జరగవచ్చు. తస్మాత్ జాగ్రత్త. పనిభారము మానసిక వత్తిడి పెరగవచ్చును. సహోద్యోగులు తమ క్రింద పనిచేసే వారు తమ మాటను పూర్తిగా వినక, పై అధికారులకు జవాబు చెప్పలేక సతమతమవుతారు. గృహంలో కూడ ఒక విధమైన సహకార లోపం ఏర్పడవచ్చును. క్రోధం తగ్గించుకోవాలి. అనవసర ఆవేశము అనర్థాలకు హేతువు కావచ్చును. వాహనములు నడుపునపుడు పరధ్యానము, అజాగ్రత్త ఏ మాత్రం శ్రేయస్సు కాదు. ఇంటర్న్‌ె ఉపయోగంలో కూడా నియంత్రణ అవసరము. చాలా రహస్యాలు ముఖాముఖిగా మ్లాడుకోవడం ఉచితము. తమను ఎక్కువగా ఇష్టపడే వారిని నిర్లక్ష్యము చేయడం, నిర్లక్ష్యం చేసేవారికోసం వెంటపడడం, వారికి అనేక విధాలుగా సహాయమందించడం చేస్తారు. కాని తమ ప్రయత్నానికి గుర్తింపుగాని, ఫలితముగాని ఉండకుండా పోతుంది. తమ పరభేదాన్ని గుర్తించండి. అనుబంధాలకు విలువనివ్వండి. ఎండమావులకై ఆరాటపడకండి. బంధువులతో అకారణ ద్వేషాలు, వివాదాలు చిరాకు కల్గిస్తాయి. తమ ప్రయత్నాలలో ఫలితము చేతికందినట్లే అంది జారిపోవడం మానసిక వ్యధకు కారణ మవుతుంది. విలాసవంతమైన, ఖరీదైన గృహోపకరణాలు, అలంకార వస్తువులు అప్పు చేసైనా కొనుగోలు చేస్తారు. ఎదుివారి ముందు తాము ఏమిో నిరూపించుకోవాలనే ప్రయత్నం చేస్తారు. విషమ పరిస్థితులలో కూడా తమ ఆత్మ విశ్వాసమును ధైర్యాన్ని తగ్గనీయరు. ఆకలితో ఉన్నా సింహం గడ్డితినదని, మీ ప్రవర్తన ద్వారా నిరూపిస్తారు. స్త్రీ విబేధాలు కనపడుచున్నవి. సంవత్సరము ఉత్తరార్థంలో వివాహ ప్రయత్నాలు సఫలము కావచ్చును. కుల దేవతారాధన చేస్తారు. అనుగ్రహము పొందుతారు. ధనం సంపాదించినట్లు కనపడినా చేతిలో అవసరానికి ధనం ఉండదు. విలువైన వస్తువులను భద్రపరచుకోవడంలో ఏ మాత్రం అశ్రద్ధ పనికిరాదు. మీ ముందు నిలబడే అర్హతలేనివారు కూడా మీకు సలహాలు ఇవ్వడము ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. ఉద్యోగంలో మాత్రం తొందరపాటు చర్యలు ఉండరాదు. కొందరికి తమ స్వయంకృతాపరాధములే రావలసిన ప్రమోషన్లు రాకపోవడం తమకన్నా తక్కువస్థాయివారు అందల మెక్కడం మనో వేదనకు కారణం అవుతుంది. అధికారుల నుండి తగిన గుర్తింపు ప్రోత్సాహము లభించును. ఎవరో చేసిన తప్పకు తాము సంజాయిషీ చెప్పవలసిన స్థితి ఏర్పడుతుంది. చట్ట వ్యతిరేకమైన పనులు చేసేవారు దరికి చేరకుండా ముందే గ్రహించి దూరం ఉంచండి. ప్రలోభాలకి లొంగి ప్రతిష్టను భంగపరచుకోవద్దు. ఊహలు తారు మారు కావచ్చును. గృహములో ఏదో తెలియని అశాంతి. బంధువుల అనారోగ్యము అరిష్ట సూచనలు. ఆస్తులు వివాదాస్పదమగుట, వంశపారంపార్య ఆస్తుల విషయంలో కలహాలు, కోర్టు గొడవలు కోరికలు పూర్తిగా తీరకపోవుట. భవిష్యత్తు గురించి ఉజ్జ్వలమైన భవిష్యత్తు గలదని చక్కని దారులు గలవని ఆ దిశలో ఆలోచిస్తారు. అవకాశాలు వస్తాయి. గోసేవ, మహాలక్ష్మి స్తోత్ర, శ్రీ సుందరకాండ పారాయణం, శని, రాహు, కేతు కుజ ధ్యాన శ్లోకాలు పఠించుట వల్ల మేలు జరుగుతుంది. వృద్ధులకు సహకరించండి. మాతాపితరులను గౌరవించండి.
కొదుమగుళ్ళ వారి శ్రీదుర్ముఖినామ సంవత్సర పంచాగము 2016-17
