మీన రాశి - పూ.భా.4 (దీ)
ఉ.భా.1,2,3,4(దూ,షం,ఝా,థా),రేవతి 1,2,3,4(దే,దో,చా,చి)
ఆదాయము 5 వ్యయం 14 రాజపూజ్యం 6 అవమానం 5
ఈ రాశివారికి గురువు వత్సరాది 11.8.16 వరకు 6వ స్థానమునందు లోహమూర్తిగా ఉండును. తదుపరి వత్సరాంతము వరకు 7వ స్థానమునందు రజితమూర్తిగా ఉండును. శని వత్సరాది 26.1.17 వరకు 9వ స్థానము నందు లోహమూర్తిగా ఉండును. రాహువు వత్సరాది వత్సరాంతము 6వ స్థానమున, కేతువు 12వ స్థానమున సువర్ణమూర్తులై ఉందురు.
ఈ విధమైన గ్రహస్థితి పరిశీలించి చూడగా ప్రథమార్ధం గురుబలం ప్రతికూలంగా ఉన్నందున శని కూడా ప్రతికూలంగా ఉన్నందున మరియు కేతువు ప్రతికూలంగా ఉన్నందున ప్రతివిషయంలోనూ తగు జాగ్రత్తలు అవసరం. మితి మీరిన ఆత్మవిశ్వాసంతో మీకై మీరు అనవసరమైన అనార్థలకు స్వాగతం పలకకండి. ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ అవసరం. అహంకారం దరికి రానీవకండి.
క్రయవిక్రయలందు చురుకుగా మీ పాత్ర ఉంటుంది.వస్తువులు జాగ్రత్తగా కాపాడుకోవాలి. చోరభయం కలదు. జాగ్రత్త. తమ సంతానముతో విరోధములు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. పాపకార్యములందు ఆసక్తి పెరుగును. ద్రవ్యలాభము, అనూహ్యంగా ధనము చేతి కందును. తలచిన పనులను సామ,దాన,బేధ ఉపాయములచే తదనంతరం కళత్ర కలహములు, దాంపత్య కలహాలు, అనవసరమైన అపోహలు ఎదురుకావడం, తమ సంతానము తమ మాట వినకపోవుట, చోరభయము, అగ్ని సంబంధిత ప్రమాదములు జరగకుండా జాగ్రత్త పడవలెను. విద్యుత్తుతో దూరంగా ఉండుట క్షేమకరం. ప్రభుత్వ విషయాలలో ాక్సీ చెల్లించుటలో అశ్రద్ధ పనికిరాదు. ప్రభుత్వపరంగా న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొనే అవకాశములు గలవు. మానసికంగా ఒక సమయంలో సుఖము మరొక సమయంలో విచారము,దుఃఖం అర్ధంకాని స్థితిని అనుభవిస్తారు. గృహవాతావరణం కూడా అర్ధంకాని స్థితి ఏర్పడుతుంది. పాపకార్యములందు ఆసక్తి, తొందరగా ధనవంతులు కావాలనే కోరిక బలీయమవుతుంది. సంఘవ్యతిరేకులు, సమాజంలో అశాంతిని సృష్టించేవారు స్నేహితులుగా మారే అవకాశము గలదు. తస్మాత్ జాగ్రత్త. ఉద్యోగమార్పు, ఉన్నత ఉద్యోగమునపై ఆసక్తి తగ్గుట, నూతన ఉద్యోగాన్వేషణ, వ్యవసాయాది కృషికి విఘాతం స్థిరచరాస్తులు వివాదాస్పదమగుట మొ|| సంభవించే అవకాశం గలదు. నమ్మిన వారే పరోక్షముగా మీ గురించి వ్యతిరేకముగా మ్లాడుట విస్మయం కల్గిస్తుంది. మానసిక విచారము. సోదరులతో ద్వేషము, వాక్కాఠిన్యము ఏర్పడే సూచనలు. శారీరక బాధయు, మానసిక విచారము, చతుష్పాద జంతువుల వలన హాని, వృధా ప్రయాణములు ప్రభుత్వ చట్టపరమైన చికాకులు ఎదుర్కొనవలసి వచ్చుట, ఆరోగ్య విషయంలో సరియైన వైద్య పర్యవేక్షణ అవసరం. స్త్రీ మూలక చికాకులు. అన్య సహవాసములు, పేరుప్రతిష్ఠ నిలుపుకోవడానికి అనేక రకాలుగా శ్రమ పడవలసి వచ్చును. ఎంత మౌనంగా ఉన్నా అనవసరండా రెచ్చగొట్టెవారు ఎదురు అవుతారు.
పై అధికారులు గతం కన్నా ఎక్కువగా ఆదరించడం సంభ్రమాశ్చర్యాలకు గురి చేయును. వాహన మార్పు కనపడుచున్నది. తమ విషయంపై కన్నా ఇతరుల విషయాలపై శ్రద్ధ చూపుట ఇబ్బందికరంగా మారుతుంది. గృహిణులకు మానసికంగా కొంత చికాకు ఉన్ననూ సామాజికంగా పేరు, ప్రతిష్ట పెరుగుతుంది. తమ సంతానానికి వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. దైవమే మనిషి రూపంగా వచ్చినట్లు ఒక అమృతహస్తం వల్ల మేలు జరుగుతుంది. చిన్న పొరపాటుకు కూడా పెద్దగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. ఎవరూ అర్ధం చేసుకోవడం లేదనే బాధ ఏర్పడుతుంది. విద్యార్ధులు శ్రమించండి. విజయం మీ చెంత గలదు. మొత్తం మీద వీరికి శుభాశుభ మిశ్రమ ఫలితము కలుగుతున్నది. ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు మహా సుదర్శన హోమం, రామరక్షా స్తోత్రం, గోసేవ, పేద కన్యకి వివాహ విషయంలో సహాయం చేసిన మేలు జరుగును.
సంవత్సర ద్వితీయార్థం నుండి మీ వ్యక్తిత్వానికి గౌరవం పెరుగుతుంది. ప్రేమచే అందరి మనస్సు ఆకర్షిస్తారు. వివాహ ప్రాప్తి గలదు. సంతానప్రాప్తి గలదు. అన్యోన్య దాంపత్య జీవితం లభిస్తుంది. ఆర్థికంగా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. విదేశాలలో ఉన్నవారికి అనుకూలంగా ఉన్నది. స్థిరాస్థి వృద్ధి చేసుకుాంరు. అయిష్టంగా కొందరిని ఆదరించవలసిన స్థితి ఏర్పడవచ్చును. ఊహలలో విహరించడం మాని జీవితానికి ఏది అవసరమో ఏది ఆచరణ యోగ్యమో, ఏది సాధ్యము అది ఆలోచించి విజ్ఞతతో నిర్ణయించుకోవాలి. అసాధ్యమైన విషయాలపై ఆసక్తి పెంచుకోవడం అవివేకమని తెలుసుకోవాలి. ఆరోగ్యంపట్ల అశ్రద్ధ పనికిరాదు. మీరు కోరుకున్న ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇష్టమైన ప్రదేశానికి స్థానచలనం, హోదా, పరపతి ఇవి అన్నీ పెరుగుతాయి. కన్యాదాన ప్రాప్తి కలదు. ఉద్యోగం క్రమబద్దీకరింపబడే అవకాశం గలదు. నూతన వాహనప్రాప్తి, అత్యుత్సాహంతో ప్రతిపనిలోనూ మీరు పాలు పంచుకోవడం అనర్ధానికి దారితీయవచ్చును. పెద్దల సంస్మరణార్ధం ఒక మంచి పని చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములతో సఖ్యత అనుకూలత ఏర్పడుతుంది. నూతన విద్యా ప్రవేశాలు. అతి మంచితనాన్ని తమ అసమర్థతగా లోకం భావించడాన్ని చూసి ఆవేదన పడతారు.
మారడానికి ప్రయత్నం చేస్తారు. వాహనాలు నడుపునపుడు జాగ్రత్త అవసరం. అగ్ని, జల సంబంధిత ప్రమాదములు ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు అవసరం. విద్యార్థులకు చివరలో అనుకూలంగా ఉన్నది. గ్టి ప్రయత్నం ఆత్మస్ధైర్యముతో ముందుకు వెళ్ళండి. గతంలో చేసిన కొన్ని పొరపాట్లకు పశ్చాత్తాపపడతారు. జీవన విధానాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగ విషయంలో అనాలోచిత నిర్ణయం అనర్ధానికి దారి తీయవచ్చు.
ధనం చేతికందుతుంది.సంతాన సౌఖ్యము, వారి అభివృద్ధిని చూసి ఆనందిస్తారు. మీరు గర్వంగా తలెత్తుకునే స్థాయికి మీ సంతానం అభివృద్ధి చెందుతారు. స్త్రీ, సౌఖ్యము మానసిక నిర్మలత్వము ఏర్పడుతుంది అభీప్సితార్థ సిద్ధి ఏర్పడుతుంది. కొన్ని సందర్భాలలో చిత్త చాంచల్యము, స్త్రీ జన విరోధము, ప్రయాణాలలో వస్తునష్టము, అకాల భోజనము వాహన ముద్రాధికారములు లభించును. పేరు ప్రతిష్టలు లభించును. భూ వసతి కలుగును. ఈ విధంగా ఈ రాశివారికి శుభఫలితాలు సంవత్సరం మధ్యకాలము నుండి అనుభవిస్తారు.
ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు గురు,శని, రాహు, కేతు, జప దానాదులు చేసిన మంచిది. శ్రీ సుదర్శనస్తోత్రము, శ్రీ లక్ష్మీనృసింహస్తోత్రము, గణపతి స్తోత్రం దుర్వార్చన మొదలగునవి చేసిన మేలు జరుగును.
కొదుమగుళ్ళ వారి శ్రీదుర్ముఖినామ సంవత్సర పంచాగము 2016-17
