
కరుప్పు( వీరభద్రుడు) ఇచ్చిన 'జోష్' తో సూర్య ఈ నెల 14 న 'విశ్వనాథ్ అండ్ సన్స్' తో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సూర్యతో పాటు హీరోయిన్ మమితా భైజు పెర్ ఫార్మెన్స్, వెంకీ అట్లూరి దర్శకత్వ ప్రతిభ, సితార 'నాగవంశీ' నిర్మాణ విలువలు 'విశ్వనాథ్ అండ్ సన్స్ ని హిట్ తీరాలకి చేర్చింది.
తాజాగా ఈ సినిమా 17 రోజులు పూర్తి చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ క్లబ్‌లో అధికారికంగా అడుగుపెట్టింది. 17వ రోజున తమిళ వెర్షన్ 1.35 కోట్ల నెట్ రాబట్టగా, తెలుగు వెర్షన్ సైతం 1.20 కోట్ల నెట్ వసూళ్లని రాబట్టడం గమనార్హం. దీంతో సూర్యకి ఉన్న తెలుగు మార్కెట్ స్టామినా పవర్ ఎంతో అర్ధం చేసుకోవచ్చు. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లోను హవా కంటిన్యూ అవుతుంది. 17వ రోజున విదేశాల్లో దాదాపు .50 లక్షల గ్రాస్ రాబట్టడంతో, మొత్తం ఓవర్సీస్ గ్రాస్ వసూళ్లు 63.20 కోట్లకు చేరుకున్నాయి. ఈ విధంగా ఇండియా గ్రాస్ 134.30 కోట్లతో వరల్డ్ వైడ్ గా 200 కోట్లు దాటింది. విడుదలైన మూడో వారంలోకి అడుగుపెట్టినప్పటికీ థియేటర్లలో ఆక్యుపెన్సీ 25% కంటే ఎక్కువగా ఉండటం విశేషం. ఈ లెక్కన లాంగ్ రన్‌లో విశ్వనాథ్ అండ్ సన్స్ మరిన్ని కొత్త రికార్డులని తిరగరాస్తుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తు వస్తున్నారు.
Also read: మాజీ బిఆర్ఎస్ ఎంపీ: చిరంజీవి చేతుల మీదుగా 'సీడ్ గణేశ’ప్రచారానికి శ్రీకారం!

[ Viswanath And Sons, 17 Days Collections, Suriya, Mamitha Bhaiju, TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood]






