
వినాయక చవితి(సెప్టెంబర్ 14 ) మరికొన్ని రోజుల్లో రాబోతున్న విషయం తెలిసిందే . దీంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం లాగానే పండుగ వాతావరణం స్టార్ట్ అయ్యింది. రెండు రోజుల నుంచే లారీల్లో, ఆటోల్లో అయితే లంబోదరుడి విగ్రహాలు తన నివాస స్థలానికి బయలుదేరుతున్నాయి. అయితే, ఈ వేడుకల వెనుక పర్యావరణానికి జరుగుతున్న తీవ్ర విఘాతం గురించి మనం ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల విపరీతమైన వాడకం వల్ల మన నీటి వనరులు కలుషితమై జలచరాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ విషయాన్ని గమనించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు, బిఆర్ఎస్ మాజీ ఎంపీ, కె సి ఆర్ తోడల్లుడు కొడుకు జే సంతోష్ కుమార్ పర్యావరణ హితమైన వినాయక చవితి వేడుకల కోసం ‘సీడ్ గణేశ’ (విత్తన గణపతి) ప్రచారాన్ని రూపొందించారు. ఈ బృహత్తర కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి తన హైదరాబాద్ నివాసంలో శ్రీకారం చుట్టి పర్యావరణ పరిరక్షణపై పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతు కెమికల్స్ తో కూడిన విగ్రహాలని నిమజ్జనం చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు పర్యవరణం తీవ్రంగా దెబ్బతింటుంది. దీంతో నా మిత్రుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆలోచన మేరకు సహజ పదార్ధాలతో, విత్తనాలతో సీడ్ గణేష్ విగ్రహాలని రూపొందించారు. 'వినాయకుడి పూజ ముగిసిన తర్వాత నీటి వనరుల్లో కాకుండా ఇళ్లలోనే విగ్రహ నిమజ్జనం చేసుకోవాలి. నా విత్తన గణపతులను సహజసిద్ధమైన మట్టి, కోకో పీట్, కొబ్బరి పీచులతో తయారు చేయడంతో పాటు, వాటిలో వేప మరియు చింత వంటి దేశవాళీ వృక్షాల విత్తనాలను అమర్చడం విశేషం. పూజ అనంతరం ఇంట్లోనే కుండీలో నీటిని చల్లి నిమజ్జనం చేయడం వల్ల ఆ విగ్రహం కరిగి, అందులోని విత్తనం మొలకెత్తి పచ్చని మొక్కగా మారుతుంది. "స్వయంగా ఆ విఘ్నేశ్వరుడే ఒక మొక్క రూపంలో మీ ఇంట్లో ఉండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. పండుగలు కేవలం వేడుకలకే పరిమితం కాకుండా ప్రతీ ఇంట్లో ఆరోగ్యంతో పాటు భగవంతుడి ఆశీస్సులని నింపాలని చిరంజీవి చెప్పుకొచ్చాడు.
Also Read: 'ప్రేమ' కి క్యాన్సర్ అంటూ ప్రచారం.. 70 ఏళ్ల వయసులోనైనా పెళ్లి చేసుకుంటానంటూ కామెంట్స్
2018లో ప్రారంభమైన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఏకంగా 19.60 కోట్లకు పైగా మొక్కలు నాటడం గమనార్హం. ‘ఒక్కరు 3 మొక్కలు నాటాలి, వాటిని 3 ఏళ్ల పాటు సంరక్షించాలి, అలాగే మరొక ముగ్గురిని నాటమని నామినేట్ చేయాలి’ అనే సరళమైన 3x3x3 సూత్రంతో ఈ ఉద్యమం కొనసాగుతోంది. ఇక 2020 కొవిడ్ పాండమిక్ సమయంలో ప్రారంభమైన ‘సీడ్ గణేశ’ వినూత్న ప్రచారం ద్వారా ప్రతీ సీజన్‌లోనూ ఉచితంగా సుమారు 1.5 లక్షల మట్టి గణపతులను భక్తులకు పంపిణీ చేయడం విశేషం.
.webp)
[ Chiranjeevi, Seed Ganesha, Green India , TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood]






