వెంకీ గౌడ ఎంత అడిగాడు.. మీరు ఎంత ఇచ్చారు!
on Jan 22, 2026

-సుస్మిత కొణిదెల సూపర్ ఆన్సర్
-సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఫిగర్ ఎంత
-ఫ్యాన్స్ నుంచి వస్తున్న డిమాండ్స్ ఏంటి!
సెల్యులాయిడ్ పై 'విక్టరీ వెంకటేష్'(Venkatesh)కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీ తెలిసిందే.మూడున్నర దశాబ్దాలపై నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో సరికొత్త రికార్డులని సృష్టించి నిర్మాతల పాలిట కల్పవృక్షంగా నిలుస్తూ ఉన్నాడు. రీసెంట్ గా వచ్చిన 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)నే ఒక ఉదాహరణ. సదరు చిత్రాన్ని చిరంజీవి మానియా ఎంతవరకు నిలబెట్టిందో, వెంకటేష్ మానియా కూడా అంతే విధంగా నిలబెట్టింది.
చిరంజీవి సైతం వెంకటేష్ రాకతో మన శంకర వరప్రసాద్ హిట్ రేంజ్ మరో స్థాయికి వెళ్లిందని చెప్తున్న విషయం తెలిసిందే. వెంకీ గౌడ గా అంతలా విజృంభించి చేసాడు. కొన్ని రోజుల నుంచి మన శంకర వర ప్రసాద్ కి వెంకటేష్ తీసుకున్న రెమ్యునరేషన్ కి సంబంధించిన ఫిగర్ పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా ఆ విషయంపై మన శంకర వర ప్రసాద్ నిర్మాతల్లో ఒకరైన సుష్మిత కొణిదెల(sushmitha Konidela)స్పందించడం జరిగింది.
ఆమె మాట్లాడుతు వెంకటేష్ గారి రెమ్యునరేషన్ విషయంలో మా మధ్య డిబేట్ ఏం జరగలేదు. ఆయన తీసుకున్న అమౌంట్ కి పూర్తి న్యాయం చేసారు .ఆయనకి ఎంత పారితోషకం ఇవ్వాలన్నా మాకు ఆనందమే. వ్యక్తిగతం గాను ఆయన చాలా పాజిటివ్ గా ఉంటారని సుస్మిత చెప్పుకొచ్చింది. దీంతో సోషల్ మీడియాలో వెంకటేష్ రెమ్యునరేషన్ ఫిగర్ పై వస్తున్న ఊహాగానాలు యధావిధిగా రూమర్స్ గా చెలామణి కానున్నాయి.
Also read: తెలుగు ప్రేక్షకులకి గుడ్ న్యూస్.. ఈ డేట్ కి కలుద్దామా!
ఇక మెగా, విక్టరీ మానియాతో మన శంకర వరప్రసాద్ 300 కోట్ల రూపాయలకి పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. అత్యంత వేగంగా ఆ ఫిగర్ ని అందుకున్న తొలి ప్రాంతీయ చిత్రంగా నిలవడంతో ఎండింగ్ ఫిగర్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. అదే టైంలో చిరంజీవి, వెంకటేష్ కాంబోలో పూర్తి స్థాయి మల్టీస్టారర్ రావాలనే డిమాండ్స్ కూడా ఊపందుకున్నాయి.
.webp)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



