తెలుగు ప్రేక్షకులకి గుడ్ న్యూస్.. ఈ డేట్ కి కలుద్దామా!
on Jan 22, 2026

-ధురంధర్ ఓటిటి వచ్చేస్తుందా!
-సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా
-రూల్స్ ప్రకారం చూస్తే ఆగకూడదు
ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 'ధురంధర్' సృష్టిస్తున్న సంచలనం అందరకి తెలిసిందే. చాలా సెంటర్స్ లో ఇంకా స్ట్రాంగ్ గా రన్ అవుతు స్టిల్ 1300 కోట్ల రూపాయలతో అప్రహాతీతంగా దూసుకుపోతుంది. దీంతో ఓటిటి సినీ ప్రేమికులు ఇప్పట్లో ధురంధర్ ని వీక్షించే వీలుండదేమో అని ఫిక్స్ అయిపోయారు. కానీ రీసెంట్ గా ఓటిటి డేట్ పై సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్న న్యూస్ ఓటిటి సినీ ప్రేమికుల్లో సంతోషాన్ని తీసుకొస్తుంది. మరి ఆ డేట్ ఏంటో చూద్దాం.
ఈ నెల 30 న నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నట్టుగా పోస్టర్స్ ని రెడీ చేసి మరి కొంత మంది అభిమానాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. నిజానికి బాలీవుడ్ ఓటిటి రూల్స్ ప్రకారం ఎనిమిది వారాలకి ధురంధర్ ఓటిటి లో సందడి చెయ్యాలి. ఆ లెక్కన ఈ నెల 30 కి ధురంధర్ ఎనిమిది వారాలని పూర్తి చేసుకుంటుంది. మరి అభిమానుల కోరిక ప్రకారం అదే డేట్ ని నెట్ ఫ్లిక్స్ అధికారకంగా ప్రకటిస్తుందేమో చూడాలి. ధురంధర్ ని 130 కోట్ల రూపాయలకి నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే.
Also Read: దుబాయ్ వెళ్ళడానికి కారణం ఇదే.. ప్రముఖ హీరోయిన్ వెల్లడి
ధురంధర్ ఓటిటి వేదికగా తెలుగు లాంగ్వేజ్ లో కూడా అందుబాటులోకి రానుంది. నిజానికి తెలుగు ప్రేక్షకుల డిమాండ్ మేరకు ధురంధర్ ని తెలుగు డబ్బింగ్ తో థియేటర్స్ లోకి తీసుకురావాలి భావించారు. కానీ ఆ సమయంలో అఖండ 2 తో పాటు మరిన్ని తెలుగు సినిమాలు రిలీజ్ ఉండడంతో థియేటర్స్ సమస్యల వల్ల తమ ప్రయత్నాన్ని పక్కన పెట్టారు. తెలుగు ప్రేక్షకులకి ఇప్పుడు ఆ లోటు ఓటిటి ద్వారా తీరబోతుంది. తమిళ, కన్నడ, మలయాళ లాంగ్వేజెస్ లోను సందడి షురూ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



