
స్టార్ హీరో మెటీరియల్ పుష్కలంగా ఉన్నా కూడా అక్కినేని నాగేశ్వరరావు(ANR)పెద్ద మనవడు, నాగార్జున(Nagarjuna)మేనల్లుడు సుమంత్(Sumanth)ఎందుకనో బడా హీరో కోటాలో చేరలేకపోయాడు, ప్రస్తుతం 'న్యూట్రన్ థర్డ్ లా' తో థియేటర్స్ లో ఉన్నాడు. సుమంత్ 2004 లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'తొలిప్రేమ' మూవీలో జత కట్టిన కీర్తి రెడ్డి( ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కొద్దీ కాలానికే విడిపోయారు.
రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో ఆ విషయంపై సుమంత్ మాట్లాడుతు మా ఇద్దరి జీవితం ఒక సినిమా కథలా సాగింది. విడిపోయినా మా మధ్య ఉన్న అనుబంధం పవిత్రమైంది. పెళ్లయిన రెండేళ్లకే అంటే 2006 లోనే పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుని వేర్వేరుగా ఉండాలని నిర్ణయించుకున్నాం. మా మధ్య ఎటువంటి పెద్ద గొడవలు కానీ, మనస్పర్థలు కానీ లేవు. పెళ్లి చేసుకున్న సమయంలో మా ఇద్దరికీ జీవితంపై, బంధాలపై సరైన మెచ్యూరిటీ, అవగాహన లేకపోవడమే విడిపోవడానికి ప్రధాన కారణం.వయసులో చిన్నవారవడం వల్ల వచ్చిన ఆ అపరిపక్వత వల్లే ఒకే ఇంట్లో కలిసి ఉండలేకపోయాం. అందుకే గౌరవప్రదంగా విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. సాధారణంగా విడాకుల తర్వాత చాలామంది దంపతులు శత్రువులుగా మారడం లేదా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం చూస్తుంటాం. కానీ తమ విషయంలో పరిస్థితి అలా రాలేదు. విడాకులు అనేవి గతాన్ని మోస్తూ బాధపడటానికి కాదు. ఒకరినొకరు క్షమించుకుని జీవితంలో ముందుకు సాగడమే.కీర్తి రెడ్డి కుటుంబ సభ్యులు ఇప్పటికీ తమ సొంత ఇంటి మనిషిగానే ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారు. అప్పుడప్పుడు ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకుంటాం.
Also read: నాగార్జున 100 వ చిత్రానికి ఆ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్.. కన్ఫర్మ్ చేసిన చిత్ర బృందం
తాత చనిపోయినప్పుడు కీర్తి రెడ్డి స్వయంగా వచ్చి మా కుటుంబాన్ని పరామర్శించింది . ప్రస్తుతం కీర్తి రెడ్డి మరొకరిని వివాహం చేసుకుని, ఇద్దరు పిల్లలతో ఒక మంచి కుటుంబంలో ఎంతో సంతోషంగా స్థిరపడటం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. నాకైతే ఇప్పటి వరకు రెండో పెళ్లి ఆలోచన రాలేదని చెప్పుకొచ్చాడు.
#Sumanth, Keerthi Reddy, Pawan Kalyan, Tollywood





