
కింగ్ నాగార్జున(Nagarjuna),దేవిశ్రీప్రసాద్(Devisriprasad).. ఈ ఇద్దరి కాంబోకి ఉన్న పవర్ అభిమానులకి, సంగీత ప్రియులకి బాగా తెలుసు. స్టిల్ ఈ టైం కూడా ఏ రీల్ చూసినా ఆ ఇద్దరి కాంబోలో వచ్చిన మన్మధుడు, మాస్, కింగ్ సినిమాలోని సాంగ్స్ వినపడుతుంటాయి. నాగ్ ప్రస్తుతం తన 100 వ చిత్రాన్ని ఎంతో ప్రెస్టేజియస్ట్ గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
ఈ ల్యాండ్‌మార్క్ మూవీకి సంగీత దర్శకుడిగా రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కన్ఫామ్ అయ్యారు. నిన్న దేవిశ్రీప్రసాద్ 47వ జన్మదినాన్ని పురస్కరించుకుని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రత్యేక బర్త్‌డే పోస్టర్ విడుదల చేస్తూ టీమ్‌లోకి ఘనంగా స్వాగతం పలికింది. ఈ క్రేజీ ప్రకటన రాగానే సోషల్ మీడియాలో #King100 ట్రెండింగ్‌లోకి వచ్చి రికార్డు వ్యూస్ సాధించింది. నాగార్జున మాస్ స్వాగ్, స్క్రీన్ ప్రెజెన్స్, క్లాస్ అప్పీల్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ పవర్ ఫుల్ ఎనర్జిటిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో దేవి శ్రీ ప్రసాద్ సిద్ధహస్తుడని నాగార్జున గట్టిగా నమ్ముతున్నాడు. అందుకే తన 100వ చిత్రానికి హిట్ సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ మరోసారి డీఎస్‌పీకే బాధ్యతలు అప్పగించారు.
Also read: అన్నయ్య ఈ సారైనా హిట్ అందుకుంటాడా.. ఆ మూవీపై భారీ అంచనాలు
ఈ మైలురాయి చిత్రంలో మరో సంచలనాత్మకమైన విశేషం కూడా దాగి ఉంది. దాదాపు 30 సంవత్సరాల విరామం తర్వాత వర్సటైల్ నటి టబు నాగార్జునతో కలిసి ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించబోతున్నారు. నాగ్, టబు కాంబోలో వచ్చిన 'నిన్నే పెళ్లాడతా', 'ఆవిడా మా ఆవిడే' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎన్ని సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకవైపు టబు రీ-ఎంట్రీ, మరోవైపు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కలసి రావడం చూస్తుంటే 'కింగ్ 100' ప్రాజెక్ట్ ఎంత గ్రాండ్‌గా డిజైన్ అవుతుందో అర్థమవుతోంది. రా కార్తీక్ దర్శకుడు, నాగార్జునే స్వయంగా నిర్మిస్తున్నాడు.
Nagarjuna, DeviSriprasad, Tollywood







