Home

»

Latest News

దొరికేసాడు: శంకర్ నెక్స్ట్ హీరో, ఈ స్టార్ హీరోనే! 

Aug 10, 2026 2:21PM

 

సినిమాతో పాటు సినీ ప్రియులు అప్ డేట్ కానీ రోజుల్లోనే అప్ డేట్ సబ్జెట్స్ తో బాక్స్ ఆఫీస్ ని గడగడలాడించిన దర్శకుడు శంకర్. కానీ విచిత్రంగా ప్రస్తుతం   అవుట్ డేటెడ్ సబ్జెట్స్ , స్క్రీన్ ప్లే తో పరాజయాలని అందుకుంటున్నాడు. ఏది ఏమైనా భారతీయ సినిమా గర్వించదగ్గ ట్రాక్ రికార్డు శంకర్ సొంతం.

రీసెంట్ గా కోలీవుడ్ సినీ సర్కిల్స్ లో  స్టార్ హీరో అజిత్ కుమార్, శంకర్ కాంబోలో ఒక భారీ చిత్రం రూపుదిద్దుకోనుందనే వార్త సినీ వర్గాల్లో  సంచలనం సృష్టిస్తోంది.స్క్రిప్ట్ చర్చల దశలో ఉన్నట్లుగా టాక్.  శంకర్ తన కలల ప్రాజెక్ట్  'వేల్ పారి' నవలను భారీ బడ్జెట్‌తో ఆవిష్కరించాలని చాలా కాలం నుంచి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అయితే శంకర్ ఇటీవల  చిత్రాలైన 'భారతీయుడు 2', 'గేమ్ ఛేంజర్' బాక్సాఫీస్ దగ్గర నిరాశపరచడంతో, 'వేల్ పారి' వంటి అత్యంత భారీ ప్రాజెక్ట్‌కు నిర్మాతలు వందల కోట్ల భారీ బడ్జెట్ కేటాయించేందుకు ప్రస్తుతం కొంత వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. దాంతో ఆ డ్రీమ్ ప్రాజెక్ట్‌ను కొంతకాలం పక్కన పెట్టి అజిత్ తో సినిమా తెరకెక్కించాలని నిర్ణయనించుకున్నాడని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.  ఈ ఇద్దరు మాత్రం చేతులు కలిపితే సంచలన ప్రాజెక్ట్ గా మారడం మాత్రం ఖాయం.

Also read: బి రెడీ.. #ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా  


ప్రస్తుతం అజిత్ కుమార్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' తర్వాత, ఆ చిత్ర దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్‌తోనే 'డేర్ డెవిల్' అనే యాక్షన్ డ్రామా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని అజిత్ స్వయంగా నిర్మిస్తుండగా, దీని కోసం దాదాపు 75 రోజుల కాల్షీట్లను కేటాయించనున్నట్లు సమాచారం. దీంతో పాటుగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఐకానిక్ హిట్ 'మంకాతా'కి సీక్వెల్‌గా 'మంకాతా 2' కూడా రేసులో ఉంది.  అజిత్ కుమార్ ప్రస్తుతం కమిట్ అయిన 'డేర్ డెవిల్', అలాగే 'మంకాతా 2' చిత్రాల షూటింగ్‌లు పూర్తయిన తర్వాతే శంకర్‌తో ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉందని కూడా  విశ్లేషకులు చెబుతున్నారు. ఈలోపు శంకర్ సిద్ధం చేసే కథ, సినిమా బడ్జెట్, మిగతా అంశాలన్నీ కుదిరితే  ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. 

 Shankar, AjithKuamar, Ram Charan

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com