
శేఖర్ కమ్ముల.. తెలుగు సినిమాకి సరికొత్త స్క్రీన్ ప్లే, భావోద్వేగాన్ని పరిచయం చేసిన విభిన్న దర్శకుడు. ఆయన చిత్రంలోని క్యారెక్టర్లు సెల్యులాయిడ్ పై పెర్ఫార్మ్ చేస్తుంటే మనతో ఏవో కబుర్లు చెప్తునట్టుగా అనిపించడంతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ గా ఫీలవుతాం. అందుకు నిదర్శనం శేఖర్ కమ్ముల నుంచి ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలు.
ఢిల్లీ వేదికగా ఆరంభమైన విద్యార్థుల పోరాటం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నీట్ (NEET) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో పారదర్శకత, బాధ్యతాయుతమైన పాలన కావాలంటూ లక్షలాది మంది విద్యార్థులు, ముఖ్యంగా నేటి 'జెన్ జీ' (Gen Z) యువతరం చేపట్టిన ఈ ఆందోళనకి సమాజంలోని అన్ని వర్గాల నుంచి అపారమైన మద్దతు వెల్లువెత్తుతోంది. ఇప్పటికే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తో పాటు పలువురు ప్రముఖ క్రీడాకారుల సతీమణులు, సామాజిక వేత్తలు పాలకులు తక్షణమే జవాబుదారీతనం వహించాలని గళమెత్తారు. ఇదే క్రమంలో శేఖర్ కమ్ముల సైతం ఈ యువ ఉద్యమం పట్ల తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన పంచుకున్న సుదీర్ఘమైన, ఆవేదనతో కూడిన అభిప్రాయాలు ప్రతి ఒక్కరి హృదయాల్ని కలిచివేస్తున్నాయి
జెన్ జీ విద్యార్థులు లేవనెత్తుతున్న డిమాండ్లలో నూటికి నూరు శాతం పూర్తి న్యాయం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. కీలకమైన నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీకి పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి అంతేకాకుండా, ఈ అన్యాయాన్ని తట్టుకోలేక, తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడిన అమాయక నీట్ విద్యార్థుల కుటుంబాలకు తక్షణమే తగిన నష్టపరిహారాన్ని అందించాలి. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి అక్రమాలు, లీకేజీలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అసలు ఏ ప్రభుత్వమైనా ప్రజలు లేదా విద్యార్థులు అడగకుండానే ప్రాథమిక బాధ్యతగా చేయాల్సిన పనులను సాధించుకోవడానికి ఈరోజు పిల్లలు రోడ్డెక్కాల్సి రావడం బాధాకరం.
Also read: సడన్ గా బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకున్న నటి.. కారణం ఇదే!
ఈ అతి చిన్న డిమాండ్ల నెరవేర్పు కోసం లక్షలాది మంది చిన్న పిల్లలు రోడ్లపై లాఠీ దెబ్బలు తింటూ రక్తమోడుతున్న దృశ్యాలు నన్ను తీవ్రంగా కలచివేస్తున్నాయి. తిండీ తిప్పలు మాని, నిద్రాహారాలు మానేసి, రాత్రనకా పగలనకా వీధుల్లో దెబ్బలు తింటూ ఓర్పుతో చేస్తున్న పోరాటంలో మన పిల్లల స్ఫూర్తి గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన పిల్లలు గెలిస్తే ఈ దేశం గెలిచినట్టే. మన పిల్లల భవిష్యత్తు సురక్షితంగా ఉంటేనే మనం సార్థకత సాధించినట్టు అని భావోద్వేగ రీతిలో చెప్పుకొచ్చాడు. శేఖర్ కమ్ముల ప్రీవి యస్ మూవీ కుబేర. నాగార్జున, ధనుష్ , రష్మిక తమ అద్భుతమైన పెర్ఫార్మ్ తో హిట్ చేసారు.
sekhar kammula, nagarjuna, dhanush, rashmika, neet delhi





