అల్లు అర్జున్ కి రూట్ క్లియర్!
on Jan 21, 2026

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్
వాయిదా పడిన వారాణసి?
మరోసారి బాక్సాఫీస్ ని షేక్ చేయనున్న బన్నీ!
పుష్పరాజ్ గా పాన్ ఇండియాని షేక్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాని 2027 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే అదే సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) కాంబినేషన్ లో రూపొందుతోన్న 'వారణాసి'(Varanasi)ని విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు.
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతోన్న మోస్ట్ హైప్డ్ సినిమాలలో ఈ రెండు ముందు వరుసలో ఉంటాయి. కంటెంట్ క్లిక్ అయితే రూ.2000 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టగల సత్తా ఈ సినిమాలకు ఉంది. అలాంటిది ఈ రెండూ ఒకేసారి విడుదలైతే.. వసూళ్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే ఈ సినిమాలు కాస్త గ్యాప్ తో విడుదలైతే బాగుంటుందనే అభిప్రాయం అభిమానుల్లో ఉంది. అందుకు తగ్గట్టుగానే 'వారణాసి' వాయిదా పడినట్లు తెలుస్తోంది.

'వారణాసి' గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో ఈ చిత్రాన్ని 2027 వేసవిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న దాని ప్రకారం.. ఈ మూవీ వేసవిలో రావడం కష్టమేనట. 2027 డిసెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. అదే జరిగితే అల్లు అర్జున్ కి రూట్ క్లియర్ అయినట్టే. 'వారణాసి' నుంచి పోటీ లేకపోతే బన్నీ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించే అవకాశముంది.
Also Read: మరో హీరోని పెట్టు.. హిట్ కొట్టు.. చిరంజీవి కొత్త సెంటిమెంట్!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



