
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni)స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీపై అభిమానుల్లోనూ, ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలే కాదు ఆ చిత్రానికి సంబంధించిన అప్ డేట్స్ కోసం నెట్టింట్లోకి అప్పుడప్పుడు తొంగి కూడా చూస్తున్నారు. రామ్ దర్శకుడు కావడమే అందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాపో 23 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుండగా రీసెంట్ గా సోషల్ మీడియాలో మూవీకి సంబంధించిన క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది.
సైకలాజికల్ థ్రిల్లర్ కావడంతో ఒక విలక్షణమైన, పవర్‌ఫుల్ నటుడిని విలన్ గా చూపించాలని రామ్ భావిస్తున్నారు. అందులో భాగంగా 'నడిప్పు అరక్కన్' గా గుర్తింపు తెచ్చుకుని, హీరోగా, విలన్ గా అద్భుతంగా రాణించే ఎస్.జె. సూర్య పేరుని చిత్ర బృందం పరిశీలిస్తోంది. ఏ క్యారక్టర్ లోకైనా పరకాయ ప్రవేశం చేయగల ఎస్.జె. సూర్య(sj suryah)అయితేనే రామ్ రాసుకున్న క్రూరమైన, ఇంటెన్స్ విలన్ కి నూటికి నూరు శాతం న్యాయం చేయగలరని భావిస్తున్నట్టుగా సమాచారం. నిజానికి విలన్ క్యారెక్టర్ కోసం మొదట మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ ని సంప్రదించినట్లు టాలీవుడ్ లో గట్టి టాక్ వినిపించింది. అయితే భారీ రెమ్యునరేషన్ డిమాండ్లతో పాటు డేట్ల సర్దుబాటు కాకపోవడం వంటి కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు ఈ గోల్డెన్ ఆఫర్ ఎస్.జె. సూర్య వద్దకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎస్.జె. సూర్యతో రెమ్యునరేషన్ మరియు కాల్ షీట్ల విషయమై చిత్ర బృందం తీవ్ర చర్చలు జరుపుతోంది.
Also read: vikram: విక్రమ్ కరుప్పుని మరిపిస్తాడా!
ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ వర్క్ విజయవంతంగా పూర్తయింది. పలువురు ప్రతిభావంతులైన దర్శకుల రచనా సహకారంతో సిద్ధమైన ఈ పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను రామ్ ఫైనల్‌గా లాక్ చేసేశారు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో 'ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ వోల్ఫ్' అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ చిత్రం కోసం రామ్ ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు.'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టిని హీరోయిన్ గా ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మలయాళ మ్యూజిక్ సెన్సేషన్ సామ్ సీస్ సంగీతం అందిస్తుండటం విశేషం. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ లో రిలీజ్ చేయాలనేది రామ్ ప్లాన్.







