
-వైరల్ గా మారిన లావణ్య ఇష్యు
-రంగంలోకి పోలీసులు
-కారులో ఉన్న వ్యక్తి ఎవరు
ప్రముఖ హీరో రాజ్ తరుణ్(Raj Tarun)లవర్ గా మీడియా ముందుకు వచ్చి రాజ్ తరుణ్ నాకు కావాలని లావణ్య(Lavanya)చేసిన హడావిడి తెలిసిందే. ఈ విషయంలో ఎవరి వాదనలు ఎలా ఉన్నా నిమిషానికి ఒక ట్విస్ట్ తో ఎన్నో క్యారెక్టర్స్ ఆ ఇద్దరి వ్యవహారంలోకి ప్రవేశించి మీడియాకి రెస్ట్ లేకుండా చేసాయి. రీసెంట్ గా లావణ్యకి సంబంధించిన తాజా న్యూస్ కూల్ గా ఉన్న సోషల్ మీడియాని హీట్ పెంచేలా చేస్తుంది. లావణ్య ఏం చూసిందో చూద్దాం.
లావణ్య మద్యం మత్తులో తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా మల్లేపల్లిలో కారు నడుపుతు మద్యం మత్తులో హల్‌చల్ చేశారు. ఒక బైక్ ని ఢీ కొట్టింది. కానీ కారు ఆపకుండా వెళ్తుంటే గ్రామస్థులు కొంత మంది లావణ్య కారుని అడ్డుకొని పోలీసులకి సమాచారం ఇచ్చారు.ఆ సమయంలో గ్రామస్థులు ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇక పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ చేయగా లావణ్యకి పాజిటివ్ రావడంతో కారుని సీజ్ చేసారు. లావణ్యతో పాటు కారులో మరో వ్యక్తి కూడా ఉండటంతో ఆ వ్యక్తి ఎవరనే చర్చ నెట్టింట జరుగుతుంది.
also read: Balakrishna: బాలకృష్ణకి అరుదైన గౌరవం.. సిఎం చేతుల మీదుగా అందచేత






