నెంబర్ వన్ గా నిలుస్తాడా!
on Dec 3, 2025

-అల్లు అర్జున్ ప్రస్తుతం ఏం చేస్తున్నాడు
-అట్లీ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు
-జపాన్ లో సందడి ఎప్పుడు
ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun),అట్లీ(Atlee)దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్, ఫిక్షన్, ఫాంటసీ మూవీ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణని జరుపుకుంటుంటుంది. దీపికా పదుకునే వంటి గ్లోబల్ హీరోయిన్ తో పాటు పాన్ ఇండియా వ్యాప్తంగా ప్రతిభావంతమైన ఆర్టిస్ట్ లు స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమకి సరికొత్త కథ, కథనాల్ని కూడా సదరు చిత్రం ద్వారా మేకర్స్ పరిచయం చేయబోతున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలే అందుకు ఉదాహరణ. నిర్మాణ, సాంకేతికత పరంగా కూడా హై స్టాండర్డ్ వాల్యూస్ ఉండనున్నాయి.
ఇక అల్లు అర్జున్ కెరీర్ లో ప్రీవియస్ మూవీ 'పుష్ప 2'(Pushpa 2)కి ఉన్న స్థానం అందరకి తెలిసిందే. అల్లు అర్జున్ ఇమేజ్ ని పాన్ ఇండియా వ్యాప్తంగా మరింత పెంచిన సినిమాగా కూడా పుష్ప 2 నిలిచింది. ఇప్పుడు ఈ మూవీ జపాన్ దేశంలో జపాన్ లాంగ్వేజ్ లో 'పుష్ప కున్రిన్' అనే పేరుతో విడుదల కానుంది.ఇందుకు సంబంధించి మేకర్స్ రీసెంట్ గా జపాన్ వర్షన్ కి సంబంధించిన ట్రైలర్ ని లాంచ్ చేసి వచ్చే ఏడాది జనవరి 16న విడుదల చేస్తునట్టు ప్రకటించారు. అంటే మన సంక్రాంతి ఫెస్టివల్ కి అల్లు అర్జున్ జపాన్ థియేటర్ లో సందడి చేస్తున్నాడన్నమాట.
also read: ఆయుధాల విషయంలో నిజం ఒప్పుకున్నసంజయ్ దత్.. షాక్ లో అభిమానులు
మూవీలో అల్లు అర్జున్ ఎంట్రీ జపాన్ దేశంలోనే ఉంటుంది. జపాన్ లాంగ్వేజ్ లో డైలాగులు ఉండటంతో పాటు జపాన్ నటులు కూడా కనపడతారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జపాన్ ప్రేక్షకులు పుష్ప 2 ని ఆదరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్(Ntr)వన్ మాన్ షో దేవర కూడా జపాన్ లో సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పుష్ప 2 సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



