
మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)వన్ మాన్ షో డ్రాగన్(Dragon)గ్లింప్స్ విడుదలైన ఇరవై నాలుగు గంటల్లోనే 64 మిలియన్ల వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గురించి ఫిలింనగర్ వర్గాల నుండి ఒక తాజా సెన్సేషనల్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను కేవలం ఒక్క భాగంతో ముగించకుండా, ఏకంగా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి
ప్రశాంత్ నీల్ సిద్ధం చేసిన సుదీర్ఘమైన, ఎమోషనల్ మైండ్ బ్లోయింగ్ కథ ఒక్క భాగంలో సరిపోదని భావించిన చిత్ర యూనిట్, దీనిని రెండు భాగాలుగా విస్తరించాలని నిర్ణయించింది. బాహుబలి, కేజీఎఫ్, సలార్, పుష్ప చిత్రాల తరహాలోనే ఈ సినిమా కూడా రెండు భాగాల ఫ్రాంచైజీగా రాబోతుండటం ఎన్టీఆర్ అభిమానులకి అసలైన పూనకాలు తెప్పిస్తోంది. ఇంకో విషయం ఏంటంటే సలార్ లా లేటు ఉండకుండా డ్రాగన్ మొదటి భాగం తెరకెక్కిస్తున్నప్పుడే రెండో భాగం కూడా తెరకెక్కిస్తున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి.
Also read: Naga chaitanya: తమిళ మాస్ డైరెక్టర్‌తో చైతు క్రేజీ ప్రాజెక్ట్! ఫ్యాన్స్ రియాక్షన్ వింటే షాక్ అవుతారు
డ్రాగన్ ని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో మైత్రి మూవీ మేకర్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ జత కడుతుంది.






