Home

»

news

Nithya menen: ఊహించని నిర్ణయం తీసుకున్న నిత్యామీనన్.. కంగ్రాట్స్ చెప్తున్న ఫ్యాన్స్

Feb 18, 2026

 

 

-సౌత్ సినీ రంగంలో నిత్యామీనన్ కి ఉన్న చరిష్మా ప్రత్యేకం 
-అప్ కమింగ్ మూవీ ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు 
-ఈ లోపు కీలక నిర్ణయం వెల్లడి చేసిన వైనం 
-మరి అందులోను తన సత్తా చాటుతుందా! 

 


అప్ డేట్ యాక్టింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్స్ నిత్యామీనన్(Nithya Menen). ఒక మూవీలో ప్రదర్శించిన నటన తాలుకు ఛాయలు మరో మూవీలో పడకుండా చూసుకుంటుంది. అందుకే హైట్ లేకపోయినా తన సినీ వెయిట్ ని మాత్రం తగ్గకండా చేసుకోగలుగుతుంది. 2008 వ సంవత్సరంలో మలయాళంలో వచ్చిన ఆకాశగోపురం నుంచి ప్రీవియస్ చిత్రమైన ఇడ్లి కొట్టు లోని క్యారెక్టర్స్ నే సినీ వెయిట్ కి   సజీవ సాక్ష్యం. సింగర్ గాను తన గాత్రానికి బ్రాండ్ హోదా కల్పించిన నిత్య మీనన్ ఇప్పుడు కొత్త రంగంలోకి అడుగుపెట్టింది. ఆ వివరాలేంటో చూద్దాం.

ఒక సినిమా తెరకెక్కడానికి మొట్టమొదటి మూలకారణం నిర్మాత. సదరు నిర్మాత లేనిదే సినిమానే లేదు. అలాంటి నిర్మాత క్యారక్టర్ ని  నిజ జీవితంలో నిత్యా మీనన్ పోషించబోతుంది. తన నూతన నిర్మాణ సంస్థ పేరు keyuriప్రొడక్షన్స్(Keyuri productions). సదరు బ్యానర్ ద్వారా కథాబలం, లోతైన పాత్రలు, సమాజంపై ప్రభావం చూపే చిత్రాలకే తన ప్రాధాన్యం ఉండబోతుంది. ఈ విషయాన్నీ తనే ఇనిస్టా వేదికగా వెల్లడి చెయ్యడంతో అభిమానులు కంగ్రాట్స్ చెప్తున్నారు.

 

Also read: ధురంధర్ 2 కి షాక్ ఇచ్చిన AICWA ..శాశ్వతంగా బ్యాన్ తప్పదా 


ప్రస్థుతానికి అయితే నిత్యా మీనన్ నుంచి కొత్త సినిమా ప్రకటన రాలేదు. ఈ విషయంలో కనీసం రూమర్స్ కూడా నిత్యా మీనన్ వైపు చూడటం లేదు.మరి ఇప్పుడు తనే  నిర్మాణ రంగంలోకి ప్రవేశిస్తున్నాని చెప్పడంతో keyuri ప్రొడక్షన్స్ నుంచే తన అప్ కమింగ్ మూవీ  ఉంటుందేమో అని అభిమానులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో, హీరోయిన్స్ పై కూడా ఆ అందరిలో చర్చ జరుగుతుంది. 


       


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com