Home

»

Gossips

'రౌడీ బాయ్స్‌' కోసం రూ. 20 ల‌క్ష‌లు పెంచిన అనుప‌మ‌!

Jan 19, 2022 3:56PM

 

దిల్ రాజు క‌జిన్ శిరీష్ కుమారుడు ఆశిష్ హీరోగా ప‌రిచ‌య‌మైన‌ 'రౌడీ బాయ్స్' సినిమా సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న విడుద‌లైంది. ఈ మూవీలో మ‌ల‌యాళం ముద్దుగుమ్మ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టించింది. శ్రీ‌హ‌ర్ష కొనుగంటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా పాక్షికంగానే ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోంది. కాక‌పోతే ఆశిష్ న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ల‌భించాయి. తెలుగు తెర‌కు మ‌రో మంచి హీరో ల‌భించాడ‌ని ప‌లువురు సెల‌బ్రిటీలు కితాబిచ్చారు.

Also read: ప్రెగ్నెంట్ గా స‌మంత‌!?

కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టించేందుకు అనుప‌మ‌కు నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్ బాగా ఎక్కువ రెమ్యూన‌రేష‌న్ చెల్లించారంటూ ఇండ‌స్ట్రీలో ప్ర‌చారంలోకి వ‌చ్చింది. సినిమాలో హీరోతో పాటు అనుప‌మ కూడా కాలేజ్ స్టూడెంట్‌గా న‌టించింది. ఆశిష్‌తో ఆమెకు ముద్దు సీన్లు కూడా ఉన్నాయి. ఇంత‌దాకా ఇలాంటి ముద్దు సీన్లు ఆమె ఎప్పుడూ చేయ‌లేదు. ఈ పాత్ర‌ను చేయ‌డానికి మొద‌ట అనుప‌మ వెనుకాడ‌టంతో, అప్ప‌టిదాకా ఆమె తీసుకునే రెమ్యూన‌రేష‌న్ కంటే రూ. 20 ల‌క్ష‌లు ఎక్కువ ఆఫ‌ర్ చేశారంట నిర్మాత‌లు. దాంతో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట అనుప‌మ‌. 

Also read: శింబుతో నిధి అగ‌ర్వాల్ ప్రేమాయ‌ణం.. కొంతకాలంగా ఒకే ఇంట్లో!

'రౌడీ బాయ్స్' చేయ‌డానికి ముందు అనుప‌మ రెమ్యూన‌రేష‌న్ సినిమాకు రూ. 30 ల‌క్ష‌లు. అంటే 'రౌడీ బాయ్స్‌'లో న‌టించినందుకు ఆమెకు ద‌క్కింది రూ. 50 ల‌క్ష‌ల‌న్న మాట‌. అలా అని సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం న‌డుస్తోంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com