తండేల్ విజయం ఇచ్చిన జోష్ తో నాగచైతన్య ప్రస్తుతం వృషకర్మ అనే మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు. విరూపాక్ష డైరెక్టర్ కావడంతో అభిమానులు,ప్రేక్షకుల్లో భాతి అంచనాలు ఉన్నాయి.
చైతు నుంచి ఓటిటి వేదికగా 2023లో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దూత సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. సూపర్ నేచురల్ 'దూత' సీక్వెల్ అధికారికంగా ప్రారంభమైంది. జూన్ 5వ తేదీన హైదరాబాద్‌లో ఈ మోస్ట్ అవేటెడ్ క్రేజీ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ పూజా కార్యక్రమాలతో అత్యంత వైభవంగా, లాంఛనంగా మొదలైంది. కింగ్ నాగార్జున ముహూర్తపు షాట్‌కి క్లాప్ కొట్టగా, దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ సరికొత్త సీజన్ కి చైతన్య. ప్రొడ్యూసర్‌గా సరికొత్త అవతారమెత్తబోతున్నారు. తండ్రి నాగార్జున దారిలోనే వెళ్తూ, కథపై మరియు దర్శకుడి విజన్‌పై ఉన్న పూర్తి నమ్మకంతోనే చైతూ ఈ ప్రాజెక్ట్‌లో నిర్మాణ భాగస్వామిగా మారడం విశేషం. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత శరత్ మరార్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ భాగస్వామ్యంలో నాగచైతన్య ఈ సరికొత్త నిర్మాణ బాధ్యతలను భుజాన వేసుకున్నారు. నిర్మాతగా ఇది నా మొదటి అడుగు , ఈ రెండో చాప్టర్‌లో మరింత మ్యాజిక్ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని భావోద్వేగంతో కూడిన సోషల్ మీడియా పోస్ట్ పంచుకున్నారు.
Also read: Peddi: ఆ ఏరియాలో పుష్ప 2 , దేవర కలెక్షన్స్ ని దాటలేకపోయిన పెద్ది
సిరీస్ మొదటి భాగం ఘనవిజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఒరిజినల్ క్రియేటివ్ టీమ్ మొత్తం 'దూత 2' కోసం మళ్లీ చేతులు కలిపింది. టాలెంటెడ్ మేకర్ విక్రమ్ కె కుమార్ సిక్వెల్ కి కూడా దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.







